అహ్మదాబాద్ టెస్ట్‌: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలుచుకున్న కోహ్లీ సేన - News Reel

IndiavsEngland

ఫొటో సోర్స్, Surjeet Yadav/Getty Images

భారత్ ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

చివరి టెస్టులో విజయంతో నాలుగు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రెండో ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ 160 పరుగుల ఆధిక్యం సాధించింది.

వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అశ్విన్ 13, అక్షర్ పటేల్ 43 పరుగులు చేశారు. ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు.

ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జేమ్స్ అండర్సన్‌ 3, జాక్ లీచ్ 2 వికెట్లు పడగొట్టారు.

తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్, 135 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లండ్ జట్టులో డేనియల్ లారెన్స్ (50), జో రూట్ (30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అక్షర్ పటేల్, అశ్విన్ చెరి ఐదు వికెట్లు పడగొట్టారు.

3-1తో సిరీస్ గెలుచుకున్న భారత్ ఐసీసీ టెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.

భారత్ విజయం

ఫొటో సోర్స్, TWITTER/BCCI

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ జాబితాలో 520 పాయింట్లతో భారత్ టాప్‌లో నిలిచింది. మొత్తం ఆరు సిరీస్‌లలో 12 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 4 మ్యాచ్‌లు కోల్పోయి, 1 డ్రా చేసింది.

ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన న్యూజీలాండ్‌తో లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో తలపడుతుంది.

Nandamuri balakrishna attacks his fan

ఫొటో సోర్స్, UGC

వీరాభిమానిని చెంపదెబ్బ కొట్టిన బాలయ్య... టచ్ బాగుందన్న ఫ్యాన్

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ యువకుడిపై చేసుకున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలోని ఓ ఇంటికి బాలకృష్ణ వెళ్లారు. అక్కడ ఉన్న ఒక యువకుడు వీడియో తీసేందుకు ప్రయత్నించారు. దాంతో బాలకృష్ణ కోపం‌‍తో ఆ యువకుడిని చేతితో కొట్టారు. 'ఆ వీడియో డిలీట్ చెయ్' అంటూ మరోసారి కొట్టారు. ఆ తర్వాత బాలయ్య ఆ యువకుడిని దగ్గరికి తీసుకుని ఫొటో దిగారు.

బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న ఆ యువకుడు తర్వాత ఒక వీడియోను విడుదల చేశారు. మెడలో టీడీపీ కండువా వేసుకున్న ఆయన, తాను బాలకృష్ణకు వీరాభిమానినని చెప్పారు. బాలయ్య తనను టచ్ చేసినందుకు గర్వంగా ఉందన్నారు.

‘‘నా పేరు సోము. నేను బాలయ్య బాబు వీరాభిమానిని. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మా అన్నయ్య వాళ్ల ఇంటికి వచ్చారు. నేను ఎవరో బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోసేసినారు. ఇలాంటి విషయాలను మేము పట్టించుకోం. ఈ రోజు ప్రచారంలో బాలయ్య బాబు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాంటిది నన్ను ఆయన టచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబు నన్ను టచ్ చేశారని గర్వంగా చెప్పుకుంటున్నా’’ అంటూ ఆ వీడియోలో యువకుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)