ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి పది కొరడా దెబ్బలు

వీడియో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి పది కొరడా దెబ్బలు

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరైనా కొరడాతో కొడతారా? కానీ, ఇది నిజం. స్వయంగా ఒక ముఖ్యమంత్రి తనను కొరడాతో కొడుతుంటే పెదవి విప్పకుండా మౌనంగా భరించారు.

రాష్ట్రం సౌభాగ్యంతో తులతూగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ముఖ్యమంత్రి అలా చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లో ఉందీ సంప్రదాయం. దుర్గ్‌ జిల్లా, జజంగిర్‌ గ్రామంలో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ వైభవంగా నిర్వహిస్తారు.

ఈ పూజలో రాష్ట్ర సీఎం స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది జరిగిన పూజలో సీఎం భూపేశ్‌ బఘేల్‌ పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన కూడా చేతిపై కొరడాతో దాదాపు పది దెబ్బలు కొట్టించుకున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)