ఉప్పొంగుతున్న గోదావరి నది.. 2006 తర్వాత ఇంత భారీ వరద ఇదే మొదటిసారి

వీడియో క్యాప్షన్, ఉప్పొంగుతున్న గోదావరి నది.. 2006 తర్వాత ఇంత భారీ వరద ఇదే మొదటిసారి

గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ దశాబ్దకాలంలోనే అత్యధికంగా నీటి మట్టం నమోదయ్యే దిశలో సాగుతోంది.

2006 తర్వాత ఇవే పెద్ద వరదలుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువన ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం నుంచి కోనసీమ గ్రామాల వరకూ వరద భయం వెంటాడుతోంది. ఇప్పటికే వందల గ్రామాల్లో గోదావరి నీరు చేరింది.

పోలవరం ముంపు గ్రామాల్లో పరిస్థితి దయనీంగా మారింది. ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజన్సీ వాసులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో వరదల్లో చిక్కుకున్న వారికి తగిన సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)