ముత్తు లక్ష్మీరెడ్డి: దేవదాసీలకు కొత్త జీవితమిచ్చిన ధీర వనిత
భిన్న సంస్కృతులున్న భారత దేశంలో సదాచారాలతో పాటు దురాచారాలూ ఎక్కువే. వీటికి బలయ్యేది బలహీనులే.
దేశంలో సామాజిక దురాచారాలను రూపుమాపడానికి ఎందరో కృషి చేశారు.
ముఖ్యంగా మహిళలను రక్షించడానికి.. వారిలో చైతన్యం రగిలించడానికి, చుట్టూ ఉన్న సమాజంలో మార్పు తేవడానికి మహిళలూ ముందుకొచ్చారు. ధైర్యంగా పోరాటాలు చేశారు. అవకాశమున్న అన్ని వేదికలపైనా గళం విప్పి మహిళాభ్యున్నతికి పాటుపడ్డారు.
అలా సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన మహిళలను ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'బీబీసీ' గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కథనాలు అందిస్తుంది. ఆ క్రమంలోనే 'దేవదాసీ' వ్యవస్థపై పోరాడిన ముత్తు లక్ష్మీరెడ్డిపై ఈ కథనం.
ఎవరీ ముత్తు లక్ష్మీ రెడ్డి?
ముత్తులక్ష్మీ రెడ్డి 1886 జులై 30న తమిళనాడులోని పుడుకొట్టాయిలో జన్మించారు.
సతీ సహగమనం ఆచారంలాగే అత్యంత దుర్మార్గమైనది దేవదాసి వ్యవస్థపై ఆమె పోరాడారు.
దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా మద్రాస్ శాసన మండలిలో ముత్తులక్ష్మీ రెడ్డి మాట్లాడారు. మండలిలో దేవదాసి రద్దు బిల్లును ఆమె ప్రతిపాదించారు. మద్రాస్ శాసన మండలి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె.
మద్రాస్ మెడికల్ కళాశాలలో తొలి మహిళా హౌజ్ సర్జన్‌గా అడుగుపెట్టింది కూడా ఆమెనే.
ఆమె తండ్రి మహారాజా కళాశాలకు ప్రిన్సిపాల్. తల్లిది ఇసాయివెలలార్ (దేవదాసి) సముదాయం.
బాలిక అనే కారణంతో మహారాజా కళాశాలలో ఆమెకు ప్రవేశం నిరాకరించారు.
ఆమె ప్రతిభను గుర్తించిన పుడుకొట్టాయి రాజా ఆమెకు ఆ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. ఆమె చదువు కోసం ఆయన ఉపకారవేతనం కూడా అందించారు.
అనిబీసెంట్, మహాహాత్మా గాంధీలతో ఆమె బాగా ప్రభావితం అయ్యారు. మద్రాస్ శాసన మండలిలో సభ్యురాలిగా అనేక చట్టాల ఆమోదానికి ఆమె కృషి చేశారు. వాటిలో ముఖ్యమైనది మద్రాస్ దేవదాసి తమిళనాడు బిల్లు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న అనైతిక ఆచారం నుంచి ఎంతో మంది మహిళలు విముక్తి పొందేందుకు అది దోహదం చేసింది.
దేవదాసీలను, వారి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఆమె అవ్వాయి హోంను ప్రారంభించారు.
వేశ్యా గృహాలను, అనైతికంగా సాగే మహిళ, బాలల రవాణాను అడ్డుకునే చట్టం తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేశారు.
ఆమె 1954లో అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పటికీ దేశ నలుమూలల నుంచి వచ్చే క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తోంది.
వైద్యం, సామాజిక రంగాల్లో సంస్కరణలకు చేసిన విశేష కృషికి ముత్తులక్ష్మి రెడ్డిని భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- పీపీఈ కిట్ల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయా...
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సీరియస్... ఐసీయూలో ఉన్నారన్న ఎంజీఎం హాస్పిటల్
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)