చంద్రగ్రహణం: ఈ లూనార్ ఎకిలిప్స్ ప్రత్యేకత ఏంటి? దీనిని మనం చూడొచ్చా?
ఈ రోజు రాబోయేది ఉపచ్ఛాయ గ్రహణం.
అంటే భూమి ప్రధాన నీడ బయటి భాగం చంద్రునిపై పడుతుంది. దీంతో చంద్రుడి వెలుగు తగ్గుతుంది.
మనం ఈ గ్రహణాన్ని చూడవచ్చా?
ఈ గ్రహణ ప్రభావం పెద్దగా కనిపించదని విజ్ఞాన్ ప్రసార్ సంస్థ సీనియర్ శాస్త్రవేత్త టి.వి.వెంకటేశ్వరన్ అన్నారు.
చంద్రుడిపై స్వల్పంగా నీడ పడుతూ కనిపిస్తుందని, ఫలితంగా చంద్రుడు లేత గోధుమ రంగులో కనిపిస్తాడని చెప్పారు.
చంద్రుడిలోని 58 శాతం భాగమే దీని పరిధిలోకి వస్తుంది.
ఈ గ్రహణాన్ని చూడటం అంత సులువు కాదని వేంకటేశ్వరన్ అంటున్నారు.
ఆకాశం నిర్మలంగా ఉండి, చంద్ర గ్రహణం పూర్తి ప్రభావంతో ఉన్నప్పుడు బాగా నిశితంగా గమనిస్తే ఇది కనిపిస్తుందని చెప్పారు.
చంద్రుడి ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య వెలుగులో తేడా కనిపిస్తుందని అన్నారు.
అసలు ఉపచ్ఛాయ గ్రహణం అంటే ఏంటి?
కాంతికి ఏదైనా వస్తువు అడ్డు పడినప్పుడు రెండు రకాల నీడలు ఏర్పడతాయని వెంకటేశ్వరన్ చెప్పారు.
ఒకటి బాగా చీకటిగా ఉండే పూర్ణచ్ఛాయ.
రెండోది కాస్త తక్కువ తీవ్రతతో విస్తరించినట్లు ఉండే ఉపచ్ఛాయ.
పూర్ణచ్ఛాయ ప్రాంతంలోకి కాంతి అసలే ప్రసరించదు.
ఉపచ్ఛాయ ప్రాంతంలోకి మాత్రం స్వల్పంగా ప్రసరిస్తుంది.
ఈ ఏడాది మొత్తంగా ఆరు గ్రహణాలు కనిపించనున్నాయి.
వీటిలో రెండు సూర్య గ్రహణాలు. నాలుగు చంద్ర గ్రహణాలు.
జనవరి 10న ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వచ్చింది. జూన్ 5న వస్తున్నది రెండో చంద్ర గ్రహణం.
జూలై 5న, నవంబర్ 30న మిగతా రెండు వస్తాయి.
జూన్ 21న, డిసెంబర్ 14న సూర్య గ్రహణాలు రానున్నాయి.
ఇవి కూడా చదవండి:
- గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపేశారు
- ఏనుగు మరణం: కేరళలోని గుళ్లలో 600 ఏనుగులను చంపేశారని మేనకా గాంధీ ఆరోపణలు.. అది నిజమేనా?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)