You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది బస్సు ప్రయాణికులు మృతి
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
తిరుప్పూర్ సమీపంలో ఓ టైల్స్ లోడుతో వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ బస్సుపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
మృతుల్లో 14 మంది పురుషులు, ఐదుగురు మహిళలున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బెంగళూరు నుంచి కేరళలోని ఎర్నాకుళానికి వెళ్తున్న కేరళ రోడ్డు రవాణా సంస్థకు చెందిన వోల్వో బస్సును కోయంబత్తూరు నుంచి సాలెమ్ వెళ్తున్న కంటెయినర్ లారీ ఢీకొట్టింది.
ఘటనా స్థలం తిరుప్పూర్ నగరానికి 20 కిలోమీటర్లుంటుంది.
పోలీసులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
"బస్సు నుంచి 19 మృతదేహాలు బయటకు తీశాం. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో మొత్తం 48మంది ప్రయాణికులున్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఎర్నాకుళం తరలించారు" అని తిరుప్ఫూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ విజయ్ కార్తికేయన్ బీబీసీకి తెలిపారు.
కంటెయినర్‌తో ప్రయాణిస్తున్న ట్రక్కు టైరు పంక్చరై, అది పక్కకు జారిపడి, హైవేపై ఎదురుగా వస్తున్న వోల్వో బస్సుపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
"మా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇలా జరిగి ఉండొచ్చని అనుకుంటున్నాం. కానీ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు" అని డాక్టర్ కార్తికేయన్ అన్నారు.
ఇవి కూడా చదవండి.
- కమల్ హాసన్ 'భారతీయుడు-2' సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి
- "పౌరసత్వం మా పరిధి కాదు, అలాంటి పదాలు వాడి ఉంటే సరిచేస్తాం..."
- చనిపోయిన కూతుర్ని వర్చువల్ రియాలిటీతో 'కలుసుకున్న' అమ్మ
- టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ
- హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు
- వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు: Ground Report
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)