చంద్రయాన్-2: ‘విక్రమ్ ల్యాండర్ దొరికింది.. కనిపెట్టింది నేనే’ - షణ్ముగ సుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, TWITTER/NASA
చంద్రుడి ఉపరితలానికి సమీపంగా వెళ్లి కనిపించకుండా పోయిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది.
ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో విక్రమ్ ల్యాండర్ జాడ తెలిసిందంటూ ఫొటోలతో కూడిన సమాచారాన్ని అందించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''ది లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా (ఎల్‌ఆర్‌వోసీ) బృందం విక్రమ్ ల్యాండర్ కూలిన స్థలానికి సంబంధించిన మొజాయిక్ చిత్రాలను తొలిసారిగా విడుదల చేసింది. విక్రమ్ జాడను తెలుసుకునేందుకు చాలా మంది ఈ మొజాయిక్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. విక్రమ్ ల్యాండర్ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రాంతానికి సంబంధించిన వివరాలను షణ్ముగ సుబ్రహ్మణ్యం 'ది ల్యూనర్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా' బృందంతో పంచుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు విక్రమ్ ల్యాండర్ ఢీ కొట్టడానికంటే ముందు, ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై తీసిన ఫొటోలను విశ్లేషించాం. విక్రమ్ ల్యాండర్ శిథిలాలను గుర్తించాం'' అని నాసా పేర్కొంది.

ఫొటో సోర్స్, NASA/Goddard/Arizona State University
తొలిసారి తీసిన మొజాయిక్ చిత్రాలు అంత స్పష్టంగా లేవని, దీని ద్వారా విక్రమ్ శిథిలాలను గుర్తించలేకపోయామని తెలిపింది.
అక్టోబర్ 14, 15, నవంబర్ 11న చిత్రాలను తీసినట్లు వెల్లడించింది. ఎల్‌ఆర్‌వోసీ బృందం నవంబర్‌లో తీసిన ఫొటో స్పష్టంగా వచ్చిందని తెలిపింది.
చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ పడిపోయిన ప్రాంతానికి 750 మీటర్ల దూరంలో, వాయువ్యదిశలో శిథిలాలను గుర్తించినట్లు పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, NASA/Goddard/Arizona State University.
‘నేనే గుర్తించా‘
నాసా నుంచి తీసుకున్న చిత్రాలను పరిశీలించే చంద్రుడిపై పడిన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను గుర్తించినట్లు షణ్ముగ సుబ్రహ్మణ్యం(33) పేర్కొన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన శిథిలాలను గుర్తించింది నేనే. నాసా నుంచి తీసుకున్న ఫొటోలను పరిశీలించే ఈ విషయాన్ని గుర్తించాను. దీనిపై నాసాకు సమాచారం అందించాను. వారు నేనిచ్చిన ప్రాథమిక సమాచారాన్ని మరింత విశ్లేషించి నా సమాచారం సరైందేనని ధ్రువీకరించారు. చంద్రయాన్ 2 ప్రయోగంపై నాకు బాగా ఆసక్తి ఉంది. మొదటి నుంచి ఈ ప్రయోగాన్ని గమనిస్తూ వచ్చాను. నేను మెకానికల్ ఇంజినీర్‌ను, ప్రస్తుతం ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NASA/Goddard/Arizona State University
ఏమిటీ విక్రమ్ ల్యాండర్
చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా భారత్ చంద్రుడిపైకి పంపించిన ల్యాండర్ పేరు విక్రమ్. అయితే, ఇది చంద్రుడి ఉపరితలం పైకి చేరుకోకముందే భూమితో సంబంధాలు కోల్పోయింది. సెప్టెంబర్ 7న అర్థరాత్రి దాటాక విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుత క్షణం కోసం కోట్లాది భారతీయులు ఆతృతగా ఎదురుచూశారు. టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో చంద్రయాన్-2 పురోగతిని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
కానీ, 'హోవరింగ్ స్టేజ్' అనే అంతిమ దశలో ఒక సమస్య వచ్చింది. చంద్రుడి ఉపరితలానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తలకు ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఫొటో సోర్స్, ISRO.GOV.IN
చివరి నిమిషంలో ఏం జరిగుంటుంది?
"2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మనకు ల్యాండర్‌తో కాంటాక్ట్స్ తెగిపోయాయి. అంటే, అంత దూరం నుంచి చంద్రుడి ఉపరితలంపైకి చేరుకునేవరకూ దాని గురించి మనకు సరైన సూచనలు లభించలేదు" అని శాస్త్రవేత్త గౌహర్ రజా చెప్పారు.
"మనకు లభించిన ల్యాండర్ ఫొటోలతో అది దిగుతున్నప్పుడు, చివరి క్షణాల్లో ఏం జరిగుంటుంది అనేది ఇప్పుడు మనం అంచనా వేయవచ్చు" అన్నారు.
చివరి క్షణంలో ల్యాండర్ స్పీడ్ కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదని, ల్యాండర్‌కు ఎలాంటి నష్టం కలగకుండా, దాని కాళ్లు సరిగ్గా కిందకు వచ్చేలా, ఒక నిర్ధారిత వేగంలో ఉపరితలంపై దించడం అనేది చాలా పెద్ద సవాలు అయ్యుంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనుకుంటూ వచ్చారు.

ఫొటో సోర్స్, isro
స్పీడ్ కంట్రోల్
సాప్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ స్పీడును గంటకు 21 వేల కిలోమీటర్ల నుంచి గంటకు 7 కిలోమీటర్లకు తగ్గించాల్సి ఉంటుంది. ఇస్రో నుంచి స్పీడ్ కంట్రోలింగ్‌లోనే పొరపాటు జరిగింది. దాంతో దాని సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు.
ల్యాండర్‌కు నాలుగు వైపులా నాలుగు రాకెట్లు లేదా ఇంజన్లు ఉంటాయి. స్పీడ్ తగ్గించడానికి వాటిని ఫైర్ చేస్తారు. వేగంగా దిగే మండే రాకెట్లు దానిని పైకి నెట్టడం వల్ల ల్యాండర్ స్పీడు తగ్గుతుంది.
ఇక చివర్లో ల్యాండర్ మధ్య ఉన్న రాకెట్‌ను మండిస్తారు. చంద్రుడికి పైన 400 మీటర్ల వరకూ ల్యాండర్‌ను జీరో స్పీడులో తీసుకురావడం దాని పని. కానీ అలా జరగలేదు. ఇక్కడ సమస్య 2 కిలోమీటర్ల కంటే ఎత్తు నుంచే మొదలైంది.
ఇవి కూడా చదవండి:
- భోపాల్ విషాదానికి 35 ఏళ్లు... ఫోటోలు చెప్పే విషాద చరిత
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- జయాబచ్చన్: 'అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపాలి’
- మా అమ్మకు వరుడు కావలెను
- గురజాడ అప్పారావు... ఆధునిక స్త్రీ ఆయన ప్రతినిధి
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయి: ‘‘ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతుర్ని భయంతో పెంచడమేనా?’’
- అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ పేరును 'దిశ'గా మార్చిన పోలీసులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









