సోనియా గాంధీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఎన్నికయ్యారు.
శనివారం దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్లు ఈ భేటీ ముగిశాక కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, హరీశ్ రావత్ తెలిపారు.
పూర్తికాల అధ్యక్షుడు/అధ్యక్షురాలు ఎన్నికయ్యే వరకు సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నారు.
ఆమె వయసు 72 సంవత్సరాలు.
2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించింది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పరిస్థితి గాడి తప్పినపుడు 1998లో సోనియా తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టారు.
ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యాక జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.
1999-2004 సంవత్సరాల మధ్య లోక్‌సభలో సోనియా ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి:
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్లోని ఫొటోల్లో నిజమెంత
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








