తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాటపై పాకిస్తాన్‌లో చర్చ... సోషల్ మీడియాలో రచ్చ

రాజా సింగ్

ఫొటో సోర్స్, facebook/Raja Singh

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ఒక పాట సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది. ఆ పాట పాకిస్తాన్ దేశభక్తి గీతాన్ని పోలివుండటమే అందుకు కారణం.

ఏటా శ్రీరామ నవమి సందర్భంగా రాజాసింగ్ ర్యాలీ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా తాను పాడిన ఒక పాటను మీడియాకు విడుదల చేశారాయన.

1.45 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో... స్టూడియోలో స్వయంగా ఆ పాట పాడుతూ కనిపిస్తారు రాజాసింగ్. ఉర్దూ, హిందీ మిళితమైన సాహిత్యం ఉన్న ఆ పాట ట్యూన్ మాత్రం, గత మార్చి నెలలో పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసిన పాటను పోలి ఉంది.

అంతేకాదు, పాట పల్లవిలోని సాహిత్యం కూడా పాకిస్తాన్ పాటలాగే ఉంది. సోషల్ మీడియాలో రాజా సింగ్ పాటను చూసిన పాకిస్తాన్ సైనికాధికారులు, తమ పాటను ఆయన కాపీ కొట్టారంటూ వెటకారంగా ట్వీట్‌లు చేశారు.

ఏప్రిల్ 12 శుక్రవారం నాడు ఈ పాటను మీడియాకు ఇచ్చిన రాజా సింగ్, ఏప్రిల్ 14 శ్రీరామనవమి సందర్భంగా పాటను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని చెప్పారు. ఈ పాట భారత సేనకు అంకితమని కూడా ప్రకటించారు.

ఈ మార్చి నెలలో పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక పాటను విడుదల చేసింది. రాజాసింగ్ పాట అచ్చం ఆ పాటనే పోలి ఉంది. పాకిస్తాన్ జిందాబాద్ అనే చోట, హిందుస్తాన్ జిందాబాద్ అని ఉంటుంది. సాహిత్యంలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి.

2019 మార్చి 23 పాకిస్తాన్ దినోత్సవం సందర్భంగా 'పాకిస్తాన్ జిందాబాద్' అనే టైటిల్‌తో ఈ పాట రూపొందించారు. దాన్ని మార్చి 21వ తేదీన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఐఎస్‌పీఆర్ అధికారిక చానెల్లో అప్‌లోడ్ అయిన ఈ పాటకు ఇప్పటి వరకూ 68.49 లక్షల వ్యూస్, 27 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

సాహిత్యం ఇమ్రాన్ రజా ఇవ్వగా, గానం, సంగీతం సాహిర్ అలీ బగ్గా అందించారు. పాట వీడియోలో భారత్ పాక్ మధ్య యుద్ధవాతావరణానికి సంబంధించిన వార్తలు, అభినందన్ వర్తమాన్‌ను విడుదల చేయడం, పాక్ త్రివిధ దళాల సాహస కృత్యాలు, పాకిస్తాన్ డే సందర్భంగా జరిగే పెరేడ్ వంటి దృశ్యాలుంటాయి.

ఇది పాకిస్తాన్ విడుదల చేసిన పాట

ఇక రాజా సింగ్ పాట హిందుస్తాన్ జిందాబాద్ పేరుతో ఉంటుంది. ఆయన స్వయంగా పాడిన క్లిప్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''దిల్ కీ హిమ్మత్ వతన్, అప్నా జిస్మా వతన్

అప్నీ సచ్చీ లగన్, సీదా రస్తా వతన్‌...''

అన్నది రెండు పాటల్లో వినిపించే పల్లవి. రెండు పాటల పల్లవి దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కేవలం పాకిస్తాన్ పాటలో 'ఖుదా' అని వచ్చినచోట రాజా సింగ్ పాటలో 'భారత్ మాత' అని వస్తుంది. ‘హర్ దిల్’ బదులు, ‘దిల్ దిల్’ వంటి పదాలు ఉంటాయి.

రాజా సింగ్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన పాటకు సమాధానంగా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఒక ట్వీట్ చేశారు.

''పాట కాపీ చేశారు. సంతోషం. కానీ నిజాల్ని కూడా ఒప్పుకోండి'' అన్నారు. భారత్ తమ యుద్ధ విమానాన్ని కూల్చలేదన్న నిజాన్ని ఒప్పుకోవాలని ఆయన ఉద్దేశం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పాకిస్తాన్‌కు చెందిన పాత్రికేయులు హామిద్ మీర్ ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించారు.

''నాకు ఏమాత్రం సంతోషంగా లేదు. ఇది కాపీ మాత్రమే కాదు, దొంగతనం కూడా. ఎవరికి అంకితం ఇచ్చారో, వారి స్థాయిని అది తగ్గించింది'' అని హమీద్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కొందరైతే, మోదీకి వ్యతిరేకంగా వాడుతున్న హ్యాష్‌ ట్యాగ్ 'చౌకీదార్ చోర్ హై' (కాపలాదారే దొంగ) అనే హ్యాష్‌ ట్యాగ్ వాడారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పాకిస్తాన్‌కు చెందిన 'డిఫరెంట్ యాంగిల్' అనే ట్విటర్ అకౌంట్ కాస్త వెటకారంగా, రాజాసింగ్ మనసులో ట్యూన్ పుట్టగానే పాకిస్తాన్ వారే ఐఎస్ఐ ద్వారా ఈ ట్యూన్ దొంగిలించి ఉండాలి. ఎంత అద్భుతమైన ట్యూన్ ఇది. అంటూ కామెంట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

కేవలం పాకిస్తానీయులే కాదు, భారతీయులు కూడా రాజా సింగ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హిందీ యూట్యూబ్ వీడియోల్లో ఫేమస్ అయిన ధ్రువ్ రాఠీ ఈ వీడియోని ఫేస్ బుక్‌లో పెట్టి కాపలాదారులే దొంగయ్యారు అంటూ పోస్ట్ చేశారు

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఈ వివాదంపై ట్విటర్‌లో రాజాసింగ్ స్పందించారు. పాకిస్తాన్ మీడియా తన హిందుస్తాన్ జిందాబాద్ పాటను కవర్ చేయడం సంతోషం అన్నారు.

''ఒక తీవ్రవాద దేశం గాయకులను కూడా అందిస్తుందా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. బహుశా పాక్ గాయకులే నా పాట కాపీ చేసుంటారు. మాకు తీవ్రవాద దేశం నుంచి కాపీ చేయాల్సిన అవసరం లేదు'' అని ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌కు జోడించిన వీడియోలో...

''ఇప్పుడే నాకు కొందరు మీడియా మిత్రులు కాల్ చేశారు. మేం 2010 నుంచి శ్రీరామ శోభాయాత్ర చేస్తున్నాం. అప్పటి నుంచి ఏటే దేశం, మతం, రాముడిపై కొత్త కొత్త పాటలు విడుదల చేస్తున్నాం. తీవ్రవాదులు పుట్టే పాక్‌లో గాయకులు పుడతారని మొదటిసారి వింటున్నా. మాకు కాపీ చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అన్ని భాషల్లోనూ గాయకులు ఉన్నారు. మేం అన్ని రకాలుగా పాకిస్తాన్‌కు సమాధానం ఇవ్వగలం. మీరే కాపీ చేశారని నేను అర్థం చేసుకుంటున్నాను'' అన్నారు

రాజా సింగ్ సమాధానం ఇచ్చిన వీడియో

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

ఈ రెండు పాటలూ సోషల్ మీడియాలో వెలువడ్డ తారీఖుల పరంగా అయితే, పాకిస్తాన్ గీతం, రాజా సింగ్ ప్రకటన కంటే నెల ముందే విడుదలయింది. 2019 మార్చి 21న పాకిస్తాన్ జిందాబాద్ పాట పబ్లిష్ అయినట్లుగా యూట్యూబ్‌లో ఉంది. రాజా సింగ్ తన పాట గురించి ప్రకటన, క్లిప్పింగ్‌లను 2019 ఏప్రిల్ 12 మధ్యాహ్నం మీడియాకు విడుదల చేశారు.

ఎవరీ రాజా సింగ్

హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. రాష్ట్రంలో ఆయనొక్కరే బీజేపీ ఎమ్మెల్యే. ముస్లింలపై బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. తనకు ముస్లింల ఓట్లు అక్కర లేదని, బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా గెలిచారు. రాజా సింగ్ వ్యవహారశైలి బీజేపీలోని ఆయన తోటి నాయకులకు కూడా ఇబ్బంది కలిగించిన సందర్భాలున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబానికి చెందిన రాజా సింగ్... ఎక్కువగా హిందీలోనే మాట్లాడతారు. గోషా మహల్ నియోజకవర్గంలో తెలుగువారితో పాటు ఉత్తరాదివారి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది.

ఆయన చెప్పిన తేదీకి ఈ పాట సోషల్ వేదికలపై అయితే విడుదల కాలేదు. దీనిపై మరింత వివరణ కోసం రాజా సింగ్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)