మాయావతి: ‘పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నా... ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తాం‘

జనసేన మాయావతి

ఫొటో సోర్స్, janasena

ఆంధప్రదేశ్‌, తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తెలిపారు.

జనసేన అధినేత పవన్ కల్యాణతో కలిసి లక్నోలో ఆమె మీడియాతో మాట్లాడారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ఆంధప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం'' అని మాయావతి చెప్పారు.

ఏప్రిల్ 3,4 తేదీలలో ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు.

మాయావతితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆమె ప్రధానమంత్రి అయితే అది తమ అదృష్టంగా భావిస్తామని తెలిపారు. ఏపీలో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.

తెలంగాణలో కూడా పోటీకి దిగుతామని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయాలను పాటిస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)