జీఎస్టీ రేట్ల తగ్గింపు జాబితా: సినిమా టికెట్లు, టీవీలు, డిజిటల్ కెమెరాలు.. దేనిపై ఎంత తగ్గింది?

ఫొటో సోర్స్, Getty Images
పలు వస్తువులపై జీఎస్టీ (వస్తు సేవల పన్ను) తగ్గిస్తూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో శనివారం జరిగిన సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది.
సినిమా టికెట్లు, డిజిటల్ కెమెరాలు, 32 అంగుళాల వరకు టీవీలు, పవర్ బ్యాంకులు, వీడియోగేమ్ పరికరాల మీద విధిస్తున్న పన్నులను తగ్గించారు.
ఇక నుంచి 28% జీఎస్టీ శ్లాబులో విలాసవంతమైన వస్తువులు మాత్రమే ఉంటాయని అరుణ్‌జైట్లీ వెల్లడించారు.
ఇప్పటి వరకు 28% శ్లాబులో 34 రకాల వస్తువులు ఉండేవి. ఇప్పుడు అందులోంచి ఆరింటిని తొలగించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.
ఈ పన్నుల తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.5,500 కోట్ల ఆదాయం తగ్గుతుందని అరుణ్ జైట్లీ అన్నారు.

ఫొటో సోర్స్, Pib
దివ్యాంగుల కోసం తయారు చేసే వీల్ ఛైర్ లాంటి ఉపకరణాలపై పన్నును 28 శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించారు. పునరుత్పాదక ఇంధన పరికరాలను కూడా 5 శాతం శ్లాబులోకి తీసుకొచ్చారు.
సేవింగ్స్, జన్ ధన్ యోజన ఖాతాల లావాదేవీలపై బ్యాంకు రుసుములను మినహాయించారు. ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో తీర్థయాత్రలు చేసే వారికి ఎకానమీ క్లాస్‌లో జీఎస్టీని 5 శాతానికి, బిజినెస్ క్లాస్‌లో 12 శాతానికి తగ్గించారు.
కొత్త పన్నులు జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
కొన్ని ప్రధానమైన వస్తువుల మీద పన్ను తగ్గింపు ఎలా ఉందో చూద్దాం.
సినీ ప్రముఖుల ప్రశంసలు.. రాహుల్ గాంధీ విమర్శలు
అయితే, జీఎస్టీ పన్నుల తగ్గింపు నిర్ణయం పట్ల సినిమా పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, విపక్ష పార్టీల నాయకుల మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"సినిమా టికెట్ల మీద జీఎస్టీ రేట్లు తగ్గించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇది చరిత్రాత్మక నిర్ణయం" అంటూ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నటులు ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా పలువురు ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఇలాగైతే 2019లో బీజేపీకి కేంద్రంలో ఓటమి తప్పదన్న ఆలోచనతోనే జీఎస్టీ తగ్గించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
జీఎస్టీని 'గబ్బర్ సింగ్ ట్యాక్స్'గా అభివర్ణించిన రాహుల్, దాని అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇవి కూడా చదవండి:
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
- ‘అసమానతల తొలగింపులో తెలంగాణకు 100కు వంద మార్కులు.. సన్ రైజ్ విజన్‌తో ముందుకు వెళ్తున్న ఏపీ’
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- ప్రపంచంలోని ఈ వింత శిక్షల గురించి మీకు తెలుసా?
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?
- సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హంతకుడికి ఉరి శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








