#BBCShe: 'డ్రగ్స్‌కు డబ్బుల కోసం కొడుకును తీసుకెళ్లి బిచ్చమెత్తుకున్నా'
మత్తు పదార్థాలకు అలవాటు పడటం, బానిస కావడం అనేది నేటి యువతను పీడిస్తున్న పెద్ద సమస్య. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని ఓ యువతి #BBCShe బృందంతో ఈ విషయంపై మాట్లాడుతూ- దీనిపై కథనాన్ని ఇవ్వాలని కోరింది.
మహారాష్ట్రలో 2016లో దేశంలోనే అత్యధికంగా సంఖ్యలో డ్రగ్స్ బాధిత మరణాలు నమోదయ్యాయి.
తన కుమారుడి ముందే తాను బ్రౌన్ షుగర్ తీసుకొనేవాడినని, డబ్బుల కోసం అతడిని తనతో తీసుకెళ్లి, బిచ్చమెత్తుకునేవాడినని మత్తుపదార్థ బాధితుల కౌన్సెలర్ తుషార్ నాతు చెప్పారు. ఇదంతా చూడలేని తన తల్లి ఓ రోజు ఆత్మహత్యాయత్నం చేశారని ఆయన వెల్లడించారు.
డ్రగ్ బాధిత మహిళల గురించి చాలా మందికి తెలియడం లేదు.
డ్రగ్స్ బాధిత మహిళలకు సరైన చికిత్స దొరకట్లేదని క్లినికల్ సైకియాట్రిస్ట్ స్వాతి ధర్మాధికారి చెప్పారు. మహిళలకు చాలా తక్కువ పునరావాస కేంద్రాలున్నాయని, అక్కడ వారికి రక్షణ తక్కువేనని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- BBC SPECIAL: దళితుల 'భారత్ బంద్' రోజున మధ్యప్రదేశ్ కాల్పుల వైరల్ వీడియో వెనకున్న అసలు కథ ఇదీ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





