'తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్: 10 మంది మావోయిస్టుల మృతి'

ఫొటో సోర్స్, Alok Putul
తెలంగాణ సరిహద్దులో ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టల ప్రాంతంలో జరిగిన 'ఎన్‌కౌంటర్'లో 10 మంది 'మావోయిస్టులు', ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మరణించారని అధికారులు తెలిపారు.
"10 మంది మావోయిస్టుల శవాలను స్వాధీనం చేసుకున్నాం" అని తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఒక అధికారి బీబీసీకి తెలిపారు.
ఈ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ మృతి చెందారని కూడా ఆయన చెప్పారు.
ఈ కాల్పుల ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తడపాల్ అనే గ్రామ సమీపంలో జరిగినట్టు ఆ అధికారి చెప్పారు.
ఈ అటవీ ప్రాంతాన్ని కర్రెగుట్టలు అని వ్యవహరిస్తారు.

ఫొటో సోర్స్, Alok Putul
ఇప్పటి వరకు ముగ్గురి మృత దేహాలను భద్రాచలం ఆసుపత్రికి తరలించారనీ, వారి రెండు మృతదేహాలు మావోయిస్టులవనీ, మరొకటి చనిపోయిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌దని ఆయన చెప్పారు.
ఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47, ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, నాలుగు 12 బోర్ తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
మృతులలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టు కొన్ని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే బీబీసీతో మాట్లాడిన పోలీసు అధికారి మాత్రం శవాలను ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు.

ఫొటో సోర్స్, Alok Putul
స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు: వరవరరావు
విరసం నేత వరవరరావు బీబీసీతో మాట్లాడుతూ, మావోయిస్టుల స్థావరం గురించి ముందే సమాచారం తెలిసి పోలీసులు దాడి చేశారని అన్నారు.
చనిపోయిన వారిలో మావోయిస్టు నేత హరిభూషణ్, ఆయన భార్య సమ్మక్క ఉన్నట్టుగా మీడియా వార్తల ద్వారా తెలిసిందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘..మావోయిస్టులు విఫలమయ్యారు’
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- ఈ 'బాల సైనికుల' భవిష్యత్తేంటి?
- ‘జిగ్నేష్ లాంటి నాయకులతో హిందుత్వ రాజకీయాలకు ప్రమాదమా?’
- 2017: సైన్స్‌లో 8 కీలక పరిణామాలివే!
- శాంతిభద్రతల నిర్వహణలో 'డ్రోన్' కన్ను
- వీల్‌ఛైర్ ప్రొఫెసర్ సాయిబాబా: ''ఈ చలికాలం దాటి బతకలేనేమో!''
- నాడు 'అన్న'.. నేడు అనాథలకు నాన్న
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








