మానవ సమాజంలో పాశ్చాత్య దేశాలు చీలిక తెచ్చాయి: రౌహాని

ఇస్లాంలో సమైక్యత కోసం ఇరాన్ పనిచేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ అన్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన గురువారంనాడు హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు, పండితులతో రౌహానీ సమావేశమై మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలివి.
- మానవ సమాజంలో పాశ్చాత్య దేశాలు చీలిక తెచ్చాయి. తూర్పు దేశాలను పశ్చిమ దేశాలు అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అణచివేతకు గురైనవారికి పోరాటం తప్ప మరో మార్గం లేదు.
- గతంలో ముస్లిం దేశాలు తమ దగ్గర ఉన్న విజ్ఞానాన్నీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్నీ అన్ని దేశాలకూ పంచాయి. కానీ ఇప్పుడు పశ్చిమ దేశాలు ఇరాన్ లాంటి దేశాలకు టెక్నాలజీ ఇవ్వట్లేదు. మేమేమీ ఉచితంగా దాన్ని అడగడం లేదు.
- ముస్లిం దేశాల మధ్య సోదర భావం పెంచేందుకు ఇరాన్ దగ్గర ప్రణాళిక ఉంది. ఇరాన్ ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. కానీ పశ్చిమ దేశాలు కొన్ని దేశాల మధ్య అంతరాలను సృష్టించాయి.

- భారతదేశంలో అన్ని మతస్థులు కలిసి ఉంటున్న తీరు అభినందనీయం. ఇదో అవకాశాల గని. యుద్ధం,హింసను ఆపడానికి దేశాలకు, ప్రాంతాలకు వ్యతిరేకంగా మేమూ నిలబడ్డాం.
- కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సాయం కోరిన ప్రతి వ్యక్తినీ ఆదుకోవాల్సిన బాధ్యత ముస్లింలకు ఉంది.
- అఫ్గానిస్థాన్, సిరియా, యెమెన్‌లకు ఉన్న సమస్యలను దూరం చేయాలని ఇరాన్ కోరుకుంటోంది. పరస్పర సోదర భావం, సహకారంతో అది సాధ్యమవుతుంది.
ఇవి కూడా చదవండి
- పీఎన్బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- డెడ్లైన్ పాలిటిక్స్: మూడు నెలలు.. మూడు గడువులు
- చెల్లెలి కోసం సోదరుడు 'విటుడి'గా మారి..
- వాలెంటైన్స్ డే స్పెషల్: వేశ్యా గృహాల్లో ప్రేమకు చోటుందా?
- పంటకు దిష్టిబొమ్మగా సన్నీ లియోని ఫొటో
- ఒక్కసారి కన్ను గీటి కోట్ల హృదయాలను దోచేసిన అమ్మాయి కథ ఇదీ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




