Exclusive: యెమెన్‌లో భీకర అంతర్యుద్ధం వీడియో
యెమెన్‌లో భీకర అంతర్యుద్ధానికి సాక్ష్యం. ఆ దేశంలోని ప్రస్తుత దుర్భర పరిస్థితులకు కారమైన చీకటి దృశ్యాలివి.
ఆ దేశ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సాలెహ్ కు చెందిన భవనాన్ని చుట్టుముట్టిన హూతి తిరుగుబాటుదారులు...కాళ్లకు సరైన పాదరక్షలు కూడా లేకుండా పోరాడుతున్నారు.
ఆ దృశ్యాలను ఈ బీబీసీ ఎక్స్‌క్లూజివ్ వీడియోలో చూడొచ్చు.
గోడలను కూల్చేసి లోపలికి ప్రవేశిస్తున్నారు. దిక్కులు పిక్కటిల్లేలా "అమెరికాకు మరణం, ఇజ్రయీల్ కు మరణం, యూదులకు శాపం తగలాలి, ఇస్లాం కు విజయం చేకూరాలి" అని నినదిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
సౌదీ సంకీర్ణ దళాలతో చర్చలు జరిపిన మాజీ అధ్యక్షుడు సాలెహ్ ను వీళ్ళు నమ్మక ద్రోహి అంటున్నారు.
ఆయన భారీ భవనం లోపల దాడుల తరువాతి దృశ్యాలివి.
ఇప్పుడు అది హుతీల ఆధీనం లో ఉన్న భవనం...సాలెహ్ కు చెందిన మనుషులు వీళ్ళ చేతుల్లో బందీలు.
హుతీలకు ఇరాన్ మద్దతు ఉందన్నది ఎప్పటినుండో ఉన్న అనుమానం కానీ ఎవరు నిరూపించలేకపోయారు.
ఇరాన్ మద్దతు విషయం గురించి మరో ముగ్గురు విశ్వసనీయ వ్యక్తులు ధ్రువీకరించారు.
సనాలో భీకర యుద్ధం జరిగిన నెల తరువాత కూడా అక్కడ భయం నీడలు కనిపిస్తూనే ఉన్నాయి.
వందల మంది సాలెహ్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు.
సౌదీ సంకీర్ణ దళాలతో చర్చలు జరిపినట్టుగా భావిస్తున్న మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సాలెహ్ మరణం తరువాత సందేహం లేకుండా, ప్రస్తుతానికి ఈ భీకర పోరాటం ఇరాన్ కు అనుకూలంగా తిరిగినట్టు కనిపిస్తోంది.
అయితే రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే విషయం పై స్పష్టత లేదు ఒక్క విషయంలో తప్ప...ఈ పోరాటంలో నలిగిపోతోన్న అమాయక ప్రజలు బాధలు మాత్రం కొనసాగుతాయి అన్నది మాత్రం ఒక చేదు నిజం.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









