రిచర్డ్ థేలర్: వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలపై రచనలకు నోబెల్

ఫొటో సోర్స్, Reuters
బిహేవియర్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడైన అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ థేలర్ ఈ ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని గెలుపొందారు.
ఈ అవార్డుతో ఆయన దాదాపు 7.5 కోట్ల రూపాయలు అందుకోనున్నారు. తాను అందుకునే ఈ డబ్బును నిర్హేతుకంగా ఖర్చు చేస్తానని ఆయన ప్రకటించారు.
ఆయన ఆర్థికశాస్త్రంలో ఎన్నో రచనలు రాశారు. ప్రత్యేకించి ఆర్ధిక అంశాల విషయంలో మనిషి ప్రవర్తన, విచ్చలవిడిగా ఖర్చు చేయడమనే అంశాలను ఆయన వివరించారు.
ప్రొఫెస్సర్ రిచర్డ్ థేలర్ ఆర్థికపరమైన విషయాలలో ఓ సగటు మనిషి ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో తెలిపారని నోబెల్ పురస్కార న్యాయనిర్ణేతైన పర్ స్ట్రోమ్బెర్గ్ తెలిపారు. రిచర్డ్ థేలర్ ఇతర పరిశోధకులకు ఆదర్శమని, బిహేవియర్ ఎకనామిక్స్ పై ఆయన చేసిన పరిశోధనలు ఆర్థికశాస్త్రంలో కొత్త శకానికి నాంది పలికిందని ఆయన అన్నారు.
ప్రొఫెస్సర్ థేలర్ నేర్పించిన మెళుకువలు ప్రజలకు మార్కెటింగ్ గురించి తెలుసుకునే అవకాశం కల్పించాయని నోబెల్ ప్యానెల్ అభిప్రాయపడింది. ప్రత్యేకంగా ప్రజలకు దీర్ఘకాలిక ఆర్ధిక ప్రణాళికల రూపకల్పనకు సహాయపడింది ప్యానెల్ తెలిపింది.

ఫొటో సోర్స్, PARAMOUNT
ప్రొఫెస్సర్ థేలర్ " ది బిగ్ షార్ట్ " అనే హాలీవుడ్ సినిమాలో కూడా కనిపించారు. ఆయన ఈ సినిమాలో క్లిష్టమైన ఆర్థిక అంశాలను వివరించారు.
ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని 1968లో ప్రారంభించారు. ఈ పురస్కారంపై ప్రారంభం నుండి అమెరికా ఆధిపత్యమే ఉంది. 2000 నుండి 2013 వరకూ అమెరికా ఆర్ధికవేత్తలకే ఈ పురస్కారం వరించింది.
గత ఏడాది ఈ పురస్కారం బ్రిటన్ కు చెందిన ఒలివర్ హార్ట్, ఫిన్లాండ్ కు చెందిన బెంగట్ హామ్స్టరోమ్ కు వరించింది.
గతంలో అర్థశాస్త్ర నోబెల్ గెల్చుకున్నవారు..
- 2016 : ఒలివర్ హార్ట్ (యుకే) బెంగట్ హామ్స్టరోమ్ (ఫిన్లాండ్)
- 2015 : అంగస్ డెల్టన్ (బ్రిటన్ -అమెరికా)
- 2014: జెన్ టిరోలే (ఫ్రాన్స్)
- 2013: యుగేనే ఫామా, లార్స్ పీటర్ హాన్సెన్ అండ్ రాబర్ట్ సిల్లెర్ (అమెరికా)
- 2012: ఆల్విన్ రోత్ అండ్ లోయ్డ్ షప్లీ (అమెరికా)
- 2011: థామస్ సార్జెంట్ అండ్ క్రిస్టోఫర్ సిమ్స్ (అమెరికా)
- 2010: పీటర్ డైమండ్ అబ్ద్ డేల్ మోర్టన్స్సెన్ (అమెరికా) , క్రిస్టోఫర్ పిస్సారీడ్స్ (సిప్రెస్-బ్రిటన్)
- 2009: ఎలినార్ ఓస్ట్రోమ్ అండ్ ఒలివర్ విల్లియంసన్ (అమెరికా)
- 2008: పాల్ క్రుగ్మాన్ (అమెరికా)
- 2007: లియోనిడ్ హుర్విచ్, ఎరిక్ మాస్కిన్ అండ్ రోజర్ మ్యేర్సన్ (అమెరికా)
- 2006: ఎడ్మండ్ ఫెల్ప్స్ (అమెరికా)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








