అంతరిక్షంలో శాటిలైట్ల యుద్ధం జరిగితే, ప్రపంచానికి ఎంత నష్టం?
2025 ఏప్రిల్‌లో అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ నగరంలో అంతరిక్ష వ్యవహారాలపై అంతర్జాతీయ సమావేశం ఒకటి జరిగింది.
ఈ రంగంలో అమెరికా బలమైన పాత్రధారి. ఇప్పుడు చైనా కూడా మరో బలమైన శక్తిగా ఎదుగుతోంది. చైనా దగ్గర అత్యాధునికమైన శాటిలైట్లు కూడా ఉన్నాయి.
ఇప్పుడా దేశం, అంతరిక్షంలోని శాటిలైట్లను ధ్వంసం చేయగల ఆయుధాలమీద ప్రయోగాలు కూడా చేస్తోంది. ఇప్పటికే రష్యా అలాంటి ప్రయోగాలు చేసింది.
ఈ సమావేశంలో ప్రసంగించిన ప్రముఖ వక్తల్లో, యునైటెడ్ స్టేట్స్ స్పేస్ కమాండ్ జనరల్ స్టీఫెన్ వైటింగ్ ఒకరు.
ఇప్పుడు యుద్ధరంగం అంతరిక్షానికి కూడా విస్తరించిందన్న విషయంలో సందేహం లేదని జనరల్ వైటింగ్ అన్నారు.
అయితే, యుద్ధాలు ఇంతవరకూ అంతరిక్షంలో జరగలేదని, అమెరికా అందుకు వ్యతిరేకి అనీ ఆయన అన్నారు.
ఈ వారం ద వరల్డ్ ఎపిసోడ్‌లో.. శాటిలైట్ యుద్ధాలతో ప్రపంచానికి ఎంత ప్రమాదం అన్నది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.










