రూఫ్ టాప్ సోలార్: మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి చేసి, వాడుకోగా మిగిలింది అమ్ముకోండి
ఏ ఇంటికైనా నెల వచ్చిందంటే భయపెట్టేది కరెంటు బిల్లే. గృహ విద్యుత్తు దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతోంది.
అలాగని డిస్కంలు ఏదో కావాలని కరెంటు ఛార్జీల ధరలు పెంచడం లేదు. వాటి కారణాలు వాటికున్నాయి.
ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు పాతికేళ్ల వరకు పైసా కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా.. ఇంటికి రాయితీపై తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్తు వెలుగులు పంచే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు, మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్కా డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించే పథకమే రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ (Rooftop Solar Programme).
ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









