You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీబీసీ పేరుతో వైరల్ అవుతున్న ఎన్నికల సర్వే – అసలు నిజమేంటి?
ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ హ్యాండిల్స్‌లో గత కొన్ని రోజులుగా ఒక నకిలీ వార్త చక్కర్లు కొడుతోంది.
బీబీసీ సర్వే ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలుపొందుతుందని ఈ నకిలీ వార్తలో చెబుతున్నారు.
కానీ, వాస్తవం ఏంటంటే....బీబీసీ అసలు ఎలాంటి సర్వేను చేపట్టలేదు. బీబీసీ పేరుతో నకిలీ సర్వే వార్త చక్కర్లు కొడుతోంది.
బీబీసీ పేరుపై ఇలాంటి నకిలీ వార్త వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు.
అంతకుముందు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నకిలీ వార్తలు సర్క్యులేట్ అయ్యాయి.
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ‘ప్రీ ఎలక్షన్ సర్వేను’, ‘ఒపినీయన్ పోల్‌ను’, ‘ఎగ్జిట్ పోల్‌ను’ ఏ సందర్భంలో కూడా బీబీసీ చేపట్టదు. ఈసారి కూడా ఎలాంటి సర్వేను చేయలేదు.
తరచూ ఎన్నికల సమయంలో, బీబీసీ ఎన్నికల సర్వే నిర్వహించిందని, ఒక నిర్దిష్ట పార్టీ గెలుస్తుందనే పేరుతో తప్పుడు ప్రచారం సాగుతోంది.
బీబీసీ ఎలాంటి ఎన్నికల సర్వేలను చేపట్టదని, ఏదైనా ఒక పార్టీ నిర్వహించిన ఎన్నికల సర్వేలను ప్రచురితం చేయదని మరోసారి బీబీసీ స్పష్టం చేయాలనుకుంటోంది.
ఇంతకుముందు కూడా తన పేరుతో వచ్చిన ఎన్నికల సర్వేలను బీబీసీ ఖండించింది.
అయినప్పటికీ, కొందరు బీబీసీ క్రెడిబిలిటీని (విశ్వసనీయతను) అదునుగా తీసుకోవాలని చూస్తున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు లేదా లోక్‌సభ ఎన్నికల సమయంలో బీబీసీ ఇలాంటి ఎన్నికలు సర్వేలు చేపట్టిందనే వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ, ఎన్నికలకు సంబంధించి బీబీసీ ఎలాంటి సర్వేలను చేపట్టదు. బీబీసీ ఎడిటోరియల్ విధానాల ప్రకారం ఈ సర్వేలు చేపట్టడానికి వీలులేదు.
ఇవి కూడా చదవండి:
- షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా, తినకూడదా? డాక్టర్లు ఏం చెప్పారంటే..
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ‘మా నాన్న సీఎం’
- ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)