గాజాలో పిల్లల ప్రాణాలు తీస్తోన్న క్షామం...

వీడియో క్యాప్షన్, ఆహార కొరత, ఆకలి, డీహైడ్రేషన్‌తో మరిన్ని మరణాలు తప్పవని వైద్యుల హెచ్చరిక.
గాజాలో పిల్లల ప్రాణాలు తీస్తోన్న క్షామం...

ఉత్తర గాజా ప్రాంతం ఆకలి కోరల్లో చిక్కుకుపోయింది. దాదాపు నెలా పదిహేను రోజులుగా ఆహార సరఫరాలు అందని చాలా మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో, తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని వైద్యులు బీబీసీకి చెప్పారు.

ఆసుపత్రిలో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఓ ఐదు నెలల చిన్నారి తల్లితో బీబీసీ మాట్లాడింది. తన బిడ్డ ఆకలిని ఎలా తీర్చాలో తెలీడం లేదంటూ ఆ తల్లి వాపోయారు.

గమనిక: ఈ కథనంలో మిమ్మల్ని కలచివేసే దృశ్యాలున్నాయి.