రోజూ 3వేల కేజీలు అమ్ముడయ్యే గువ్వల చెరువు పాలకోవా ప్రత్యేకత ఏంటి?

వీడియో క్యాప్షన్, బ్రెడ్ మధ్యలో పెట్టుకు తినే ఈ పాలకోవా ఎందుకంత ఫేమస్? దీనిని ఎలా తయారు చేస్తారు?
రోజూ 3వేల కేజీలు అమ్ముడయ్యే గువ్వల చెరువు పాలకోవా ప్రత్యేకత ఏంటి?

కడప నుంచి చిత్తూరుకు వెళ్లే మార్గంలో గువ్వల చెరువు వద్ద విక్రయించే పాలకోవా 'చాలా పాపులర్'.

వైఎస్ఆర్ కడప జిల్లా రామాపురం మండలంలోని గువ్వలచెరువు గ్రామంలో దాదాపు 3,000 మంది ఉంటే, వారిలో 300 మంది పాలకోవా వ్యాపారంలోనే ఉన్నారు. కట్టెల పొయ్యిపై పాలకోవా తయారు చేయడం వీరి ప్రత్యేకత.

గువ్వలచెరువు గ్రామం దగ్గర షాపుల్లో అమ్ముతున్నారు కాబట్టి దీనికా పేరు. రొట్టెను కట్ చేసి మధ్యలో పాలకోవా వేసుకు తినడమే ఇక్కడి ప్రత్యేకత.

రోజూ 3 వేల కేజీల పాలకోవా సిద్ధం చేస్తామని తయారీదారులు చెబుతున్నారు. ఈ పాలకోవాను ఎలా తయారు చేస్తారు?

పాలకోవా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)