ఇంకా మూడేళ్లే బతుకుతారన్నారు.. ఈ కుక్క చేస్తున్న సాయంతో పదేళ్లుగా ప్రాణాలతో ఉన్న మాజీ సైనికుడు

వీడియో క్యాప్షన్, ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆర్చీ డగ్లస్‌ బీబీసీతో పంచుకున్న అనుభవాలు
ఇంకా మూడేళ్లే బతుకుతారన్నారు.. ఈ కుక్క చేస్తున్న సాయంతో పదేళ్లుగా ప్రాణాలతో ఉన్న మాజీ సైనికుడు

బ్రిటన్‌లో కొకోవా అనే కుక్క… ఓ మాజీ సైనికుడి జీవితాన్ని మార్చేసింది.

బ్రేవ్ హౌండ్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన శిక్షణతోనే ఇది సాధ్యమైంది అంటున్నారు ఆర్చీ డగ్లస్.

2013లో అఫ్గానిస్తాన్‌లో పనిచేసిన ఈ మాజీ సైనికుడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మూడేళ్లకు మించి బతకలేరని డాక్టర్లు చెప్పారు.

నార్త్ బెర్విక్‌లో ఉంటున్న ఆర్చీ అది జరిగి పదేళ్లయినా సంతోషంగా గడుపుతున్నారు.

మాజీ సైనికులకు తోడుగా ఉంటూ సాయం చేసేలా కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది బ్రేవ్‌హౌండ్ అనే స్వచ్ఛంద సంస్థ.

కొకోవా సాయంతో ఇప్పుడు తాను స్వేచ్ఛగా, మెరుగ్గా జీవిస్తున్నాను అంటున్నారు ఆర్చీ డగ్లస్.

dog

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)