యారో హెడ్: మొసళ్లను వేటాడే ఈ ఆడపులి చనిపోతే ఫోటోగ్రాఫర్లు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు..

యారోహెడ్

ఫొటో సోర్స్, Sachin Rai

ఫొటో క్యాప్షన్, తన బుగ్గపై బాణం ఆకారంలో చారలు ఉండటంతో యారో‌హెడ్‌గా నామకరణం
    • రచయిత, చెరీలాన్ మొలాన్
    • హోదా, బీబీసీ న్యూస్

మొసళ్లపై దాడి చేసి, మందమైన వాటి చర్మాన్ని తన పదునైన దంతాలతో ఒలిచి తినడంలో ఫేమస్ అయిన ఆడపులి 'యారోహెడ్' మృతి చెందడంతో.. భారతీయ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు, జంతు ప్రేమికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

యారోహెడ్‌తో తమకున్న అనుబంధాన్ని వారు షేర్ చేసుకున్నారు. యారోహెడ్ మృతిపై వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ సచిన్ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ఈ ఆడపులిని, అది కూనగా ఉన్నప్పటి నుంచి సచిన్ రాయ్ ఫోటోలు తీస్తూ వచ్చారు.

టీ-84గా పిలుచుకునే ఈ 'యారోహెడ్' వయసు 11 ఏళ్లు. అది గత వారం అనారోగ్యంతో మరణించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యారోహెడ్

ఫొటో సోర్స్, Sachin Rai

యారోహెడ్‌కు ఆ పేరెలా వచ్చింది?

మృతి చెందిన ఈ ఆడపులికి వన్యప్రాణి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్‌లు సంతాపం తెలియజేశారు.

ఈ పులిని చివరిసారి చూసేందుకు వారిలో చాలామంది నేషనల్ పార్క్‌కు వచ్చారు.

'యారోహెడ్'కు ఈ లెజెండరీ స్టేటస్ దాని పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ ఆడపులి కృష్ణ అనే పులి కూతురిగా, మచ్లి అనే పులికి మనవరాలిగా చెబుతుంటారు. రణథంబోర్‌లో ఒకప్పుడు ఈ పులుల సంతతి ఎక్కువగా ఉండేది.

మొసళ్లను వేటాడటంలో ఈ పులులు మంచి పేరుంది. క్రోకోడైల్ కిల్లర్స్‌గా వీటిని చెబుతుంటారు. తమ బలమైన దంతాలతో మొసళ్లను చంపి తినేవి ఈ పులులు.

ఈ ఆడపులి బుగ్గపై బాణం ఆకారంలో చారలు ఉండటంతో ఓ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ దీనికి ‘యారోహెడ్‌’ అని పేరు పెట్టినట్లు రాయ్ చెప్పారు.

ఆరోగ్యం బాగాలేని రోజుల్లో కూడా ఈ పులి మొసళ్లను వేటాడిందని రాయ్ తెలిపారు.

‘‘మొసళ్లు దాని నుంచి తప్పించుకోలేకపోయేవి. అసలు ప్రతిఘటించలేకపోయేవి'' అని రాయ్ చెప్పారు.

ఈ స్కిల్స్ కారణంగానే దాన్ని క్రోకోడైల్ హంటర్ అని పిలిచేవారు దాని అభిమానులు.

చనిపోవడానికి కొన్ని రోజులు ముందు కూడా ఒక మొసలిని వేటాడిందని రాయ్ చెప్పారు.

యారోహెడ్

ఫొటో సోర్స్, Sachin Rai

ఫొటో క్యాప్షన్, రణథంబోర్ జాతీయ ఉద్యానవనంలో యారో‌హెడ్

‘కూతురే గెంటేసింది’

ఆకర్షణీయంగా, గంభీరంగా కనిపించినప్పటికీ, యారోహెడ్ తన జీవితంలో అనేక ఇబ్బందులు పడినట్లు రాయ్ తెలిపారు.

ఆ పులి కూతురు రిధి కారణంగా, యారోహెడ్ తాను నివసించే ప్రాంతం నుంచి బయటికి రావాల్సి వచ్చింది.

స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు, వివిధ ప్రదేశాలను వెతుకుతూ యారోహెడ్ పలు మగ పులులతో లైంగిక చర్యల్లో పాల్గొనాల్సి వచ్చిందని రాయ్ వెల్లడించారు.

(ఒక మగపులి, ఆడ భాగస్వామిని మాత్రమే తన ఏరియాలోకి రావడానికి, అక్కడ పిల్లలను కని సాకడానికి అనుమతి ఇస్తుంది. )

యారోహెడ్ తన జీవితంలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, దాని పిల్లల్లో చాలా వరకు బతికి లేవు.

శరీరంలో కణితి ఏర్పడటంతో యారోహెడ్‌కు ఆరోగ్యం క్షీణించింది. చాలా రోజులు వేటకు వెళ్లలేకపోవడంతో, పార్క్ అధికారులే దానికి ఆహారాన్ని అందించారు.

యారోహెడ్ (కుడివైపు)

ఫొటో సోర్స్, Sachin Rai

ఫొటో క్యాప్షన్, యారోహెడ్ (కుడివైపు)

యారోహెడ్ చివరి రోజుల్లో దానికి దగ్గర్లోనే గడిపిన రాయ్, అంత శక్తిమంతమైన జీవిని అలా చూడటం బాధనిపించిందని అన్నారు.

''నడవడానికి కూడా ఇబ్బంది పడింది. అడుగు వేయలేక పడిపోయేది'' అని రాయ్ అన్నారు.

చిత్రంగా, యారోహెడ్ తన చివరి రోజులను తన కూతురు రిద్ధి టెరిటరీలోనే గడిపింది.

''రిధి తల్లిని ఏమీ అనలేదు. విశ్రాంతి తీసుకోనిచ్చింది'' అని చెమ్మగిల్లిన కళ్లతో రాయ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)