విలయం తర్వాతి దృశ్యం: విజయవాడలో వరద అనంతర పరిస్థితులు - 9 ఫోటోలలో...

విజయవాడలో ఇటీవల వచ్చిన భారీ వరదకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సింగ్ నగర్ ఒకటి. ఇక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ దాదాపు లేదు. ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది.
వరద నీరు వెళ్లిపోవడంతో ఇళ్లు, షాపులు, పరిసరాలు, సామాన్లు, దుస్తులను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు స్థానికులు.
వరద నీటిలో మునిగి, తేలిన ఒక స్కూటీ ఓ ఇంటి ముందు ఇలా కనిపించింది.


ఒక కిరాణా షాపులో తడిసిపోయిన కందిపప్పు, మొక్కజొన్నలతో పాటు బస్తాలకొద్దీ ఆహార ధాన్యాలను ఇలా బయట పడేశారు.
వరద నీటి కారణంగా ఇళ్లు, షాపులు, గోడౌన్లలోని ధాన్యం, ఇతర ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున తడిసిపోయి నిరుపయోగంగా మారాయి.

ఒక ఫ్యాన్సీ షాపును వరద నీరు ముంచెత్తడంతో అందులోని సామాగ్రి చెడిపోయింది. తడిసిపోయిన వస్తువులను ఇలా బయట పడేశారు.

బురదమయంగా మారిన సామాన్లను శుభ్రం చేసేందుకు ఓ హోటల్ యజమాని వాటిని ఇలా ఒక చోటకు చేర్చారు.

తడిచిపోయిన స్కూలు బ్యాగుతో నడిచి వెళుతున్న విద్యార్థి.

సింగ్ నగర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వరద నీరు ఉంది. స్థానికులు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు.

వరద నీరు వెళ్లిపోవడంతో విజయవాడలోని డాబా కొట్లు సెంటర్‌లోని మెయిన్ రోడ్డు సోమవారం మధ్యాహ్నం ఇలా కనిపించింది.

వరద నీటిలో మునిగి చెడిపోయిన వాహనాలను బాగు చేయించుకునేందుకు మెకానిక్ షాపుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు.

ప్రకాశం బరాజ్‌ను పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ దిమ్మెకు రిపేర్లు కొనసాగుతున్నాయి.
(ఫోటోలు: సాయి రామకృష్ణ, బీబీసీ కోసం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














