తెలంగాణ: మేడపైకి ఎక్కిన దున్నను కిందకు ఇలా తెచ్చారు

వీడియో క్యాప్షన్, తెలంగాణ: డాబా ఎక్కిన దున్నను కిందకు ఇలా తెచ్చారు
తెలంగాణ: మేడపైకి ఎక్కిన దున్నను కిందకు ఇలా తెచ్చారు

నిర్మల్ జిల్లాలో మేడపైకి ఎక్కిన ఒక దున్నను చివరికి ఇలా కిందికి దించాల్సి వచ్చింది.

వెంగ్వాపేట్‌లో ఒక ఇంటి మెట్లపై మొలిచిన గడ్డిని తింటూ ఇది మేడపైకి చేరుకుంది.

తర్వాత మెట్లపైనుంచి దిగలేకపోయిన దున్న మేడపైనే ఉండిపోయింది.

ఇది గమనించిన ఇంటి యజమాని గ్రామ సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు.

దీంతో క్రేన్ తెప్పించిన పంచాయతీ సిబ్బంది దున్నను క్రేన్ బెల్టులకు కట్టారు.

తర్వాత దున్నపోతును మెల్లగా, సురక్షితంగా కిందికి దించగలిగారు.

ఈ ఘటన శనివారం జరిగింది..

దున్న

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)