యుక్రెయిన్‌, రష్యా యుద్ధానికి 1,000 రోజులు, చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, ప్రమాదంలో పడిన శరణార్థుల స్కూలు భవిష్యత్తు
యుక్రెయిన్‌, రష్యా యుద్ధానికి 1,000 రోజులు, చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది?

యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి ఆక్రమణ మొదలై నవంబర్ 19 నాటికి 1,000 రోజులు పూర్తయ్యాయి.

యుద్ధం ప్రభావం స్కూలు పిల్లలపై తీవ్రంగా పడింది. చిన్నపిల్లలు నిర్వాసితులుగా మారిపోయారు. చదువుకి దూరమయ్యారు.

యుద్ధం కారణంగా శరణార్థులై పోలండ్ పారిపోయిన యుక్రెయిన్ ప్రజల సంఖ్య దాదాపుగా పది లక్షలు ఉంది. చిన్నారుల కోసం యుద్ధం మొదలైన తొలినాళ్లలో పోలండ్‌లోని వార్సాలో ప్రత్యేకంగా స్కూలుని ప్రారంభించారు. ఇక్కడ చదువు చెప్పేది, స్కూలుకి వెళ్లి చదువు నేర్చుకునేది కూడా శరణార్థులే. అయితే దీనికవసరమైన ఆర్థిక సాయంపై భరోసా లేక స్కూలు భవిష్యత్తు ప్రమాదంలో పడింది.

బీబీసీ ప్రతినిధి డయానా కురిష్కో అందిస్తున్న కథనం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)