యుక్రెయిన్‌పై యుద్ధంలో మొదట గెలుచుకున్న నగరంపై పట్టు కోల్పోయిన మాస్కో
యుక్రెయిన్ నగరం ఖేర్సన్ నుంచి వెనక్కి రావాలని రష్యా తమ సైనికుల్ని ఆదేశించింది. మార్చ్‌లో రష్యా యుక్రియన్ మీద దాడి చేసిన తర్వాత ఈ నగరాన్ని చేజిక్కుంచుకుంది. కొన్ని వారాలుగా ఈ ప్రాంతంపై ఆధిపత్యం సాధించిన యుక్రెయిన్ బలగాలు రష్యన్ సేనలపై ఒత్తిడి పెంచాయి. ఖేర్సన్‌లో ఉన్న తమ సైనికులకు సరఫరాలను అందించడం ఇకపై ఎంత మాత్రం సాధ్యం కాదని యుక్రెయిన్‌లోని రష్యన్ బలగాల కమాండ్ తెలిపారు. ఖేర్సన్ నగరాన్ని వదిలేస్తున్న రష్యన్ సైనికులు డినిప్రో పశ్చిమ తీరం నుంచి ఎదురు దాడి చేస్తూ తూర్పు వైపు మరింతగా విస్తరించేందుకు మళ్లీ ప్రయత్నించనున్నారు. ఇది రష్యా, పుతిన్‌కు భారీ ఎదురు దెబ్బ. ఖేర్సన్ యుద్ధక్షేత్రంలోయుక్రెయిన్ సైనికులతో కొన్ని రోజులుగా ప్రయాణిస్తూ అక్కడి పరిస్థితులను రిపోర్ట్ చేస్తున్నారు బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరేమీ బోవెన్.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: ‘8ఏళ్ల తర్వాత మోదీని కలిశా.. ఏపీకి మంచిరోజులు వస్తాయి’
- మోదీ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మందితో జనసమీకరణ చేస్తోంది ఎందుకు
- అఫ్గానిస్తాన్‌లో బ్రిటన్ సైనిక చర్యలతో 64 మంది చిన్నారుల మృతి
- టీ20 వరల్డ్ కప్: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రూల్స్ మార్చిన ఐసీసీ
- 'యశోద' రివ్యూ: సమంత వన్ 'ఉమన్' షో
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఫొటో సోర్స్, Getty Images



