పవన్ కల్యాణ్: ‘8 ఏళ్ల తర్వాత మోదీని కలిశా.. ఏపీకి మంచిరోజులు వస్తాయి’

విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఆ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. నల్గొండ జిల్లా: బుల్లెట్ బైక్ బాడీ, ఆటో ఇంజన్‌తో ట్రాక్టర్.. వ్యవసాయ ఖర్చులు తగ్గించుకునేందుకు ఓ రైతు వినూత్న ప్రయత్నం

  3. ఎనిమిదేళ్ల తరువాత కలిశాను.. ఏపీకి మంచి రోజులు వస్తాయి: మోదీతో భేటీ తరువాత పవన్ కల్యాణ్

    pawan kalyan

    ఫొటో సోర్స్, janasena

    ప్రధాని మోదీతో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.

    8 సంవత్సరాలతో ఆయన్ను కలవడం ఇదేనని.. ప్రత్యేక పరిస్థితులలో ఆయన్నుకలిశానని చెప్పారు.

    ‘ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా రెండు రోజుల కిందట నాకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది.

    చాలాసార్లు దిల్లీ వెళ్లినా ఆయన్ను కలవలేదు.

    2014 ప్రమాణ స్వీకారానికి ముందు కలిశాను. మళ్లీ 8 ఏళ్ల తరువాత ఇప్పుడే కలిశాను’ అని చెప్పారు పవన్ కల్యాణ్.

    ఏపీ బాగుండాలి, ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందాలనేది ప్రధాని ఆకాంక్ష అని... ఆయన కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు, నాకు అవగాహన ఉన్నంత వరకు ఆయనకు వివరించానని చెప్పారు.

    తమ భేటీ తరువాత ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

    అయితే, ప్రధానితో భేటీలో ఏఏ అంశాలపై మాట్లాడుకున్నారనేది ఆయన వెల్లడించలేదు.

  4. విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో

    విశాఖ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ

    ఫొటో సోర్స్, bjp andhrapradesh

    ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో మారుతి జంక్షన్ నుంచి నావల్ డాక్ యార్డ్ వరకు సాగింది.

    ఒకటిన్నర కిలోమీటర్ సాగిన రోడ్ షోలో ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు.

    ప్రధాని రాత్రికి తూర్పు నౌకాదళానికి చెందిన ‘చోళ సూట్‌’లో బస చేస్తారు.

    narendra modi

    ఫొటో సోర్స్, bjp andhrapradesh

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం జగన్

    మోదీకి స్వాగతం పలికిన జగన్

    ఫొటో సోర్స్, ap cmo

    ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు.

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

    మారుతి జంక్షన్ నుంచి నేవల్ డాక్‌యార్డ్ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మేర సాగనున్న రోడ్ షో మొదలైంది.

    ఈ రోజు రాత్రి ప్రధాని తూర్పు నౌకాదళానికి చెందిన చోళ సూట్‌లో బస చేస్తారు.

    శనివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలో 10.30 నుంచి నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు.

    అనంతరం మధ్యాహ్నం విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు.

    విశాఖలో బీజేపీ కార్యకర్తలు

    ఫొటో సోర్స్, bjp

  6. నరేంద్ర మోదీ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మందితో జనసమీకరణ చేస్తోంది ఎందుకు?

  7. అఫ్గానిస్తాన్‌లో బ్రిటన్ సైనిక చర్యలతో 64 మంది చిన్నారుల మృతి

  8. టీ20 వరల్డ్ కప్: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రూల్స్ మార్చిన ఐసీసీ

  9. భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు?

  10. 'యశోద‌' రివ్యూ: స‌మంత వ‌న్ 'ఉమన్‌' షో!

  11. కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    కెంపెగౌడ

    ఫొటో సోర్స్, @PMOIndia

    బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు.బెంగళూరు నగరానికి విమానంలో వచ్చేవారికి ఈ విగ్రహం కనిపిస్తుంది.

    విజయనగర సామ్రాజ్యం సామంతుల్లో ఒకరైన కెంపెగౌడ, 511 సంవత్సరాల కిందట బెంగళూరు నగరాన్ని నిర్మించారు.

    కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

    ఫొటో సోర్స్, @PMOIndia

    దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మోదీ శుక్రవారం నాడు బెంగళూరులో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతో ప్రారంభంతో పాటు, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్-2 ను కూడా ప్రారంభించారు. కెంపెగౌడ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  12. యోగి వేమన విశ్వవిద్యాలయంలో విగ్రహాల మార్పుపై వివాదం ఎందుకు, ఎవరు ఏమంటున్నారు?

  13. రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషుల ముందస్తు విడుదలకు సుప్రీం ఆదేశాలు

    నళిని

    ఫొటో సోర్స్, Getty Images

    రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా శిక్షను అనుభవిస్తున్న నళిని శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్‌ సహా ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    వీరంతా ఈ కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు.

    తమను ముందస్తుగా విడుదల చేయాలంటూ నళిని, రవిచంద్రన్ లు పెట్టుకున్న పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయగా, దీనిపై వీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

    దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వీరి విడుదలకు ఆదేశించింది.

    గతంలో ఇదే కేసులో దోషి ఏజీ పేరరివాలన్‌ను విడుదల చేసిన నిబంధనల ప్రకారమే వీరిని కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఇది విచారకరం:కాంగ్రెస్

    సుప్రీంకోర్టు భారత స్ఫూర్తిని ప్రదర్శించలేకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. రాజీవ్ హంతకులను విడుదల చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3

    పోస్ట్ of X ముగిసింది, 3

    2022 మే 18న సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం రాజీవ్ హత్య కేసులో 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పేరరివాలన్‌ను విడుదల చేసింది.

    రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళిని, తనను త్వరగా విడుదల చేయాలని కోరుతూ ఆగస్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తుగా విడుదల చేయాలన్న తన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు.

    ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, ముందస్తు విడుదల కావాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని మద్రాస్ హైకోర్టు పేర్కొంంది. దీంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు.

  14. టీ20: అడుక్కుని ఎవరూ గొప్పవాళ్లు కాలేరు-పాక్ జర్నలిస్టుకు ఇండియన్ బిజినెస్‌ మ్యాన్ సమాధానం

    టీ20 వరల్డ్ కప్

    ఫొటో సోర్స్, @tehseenp

    టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్‌ ఓటమిపై పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయుడు హమీద్‌ మీర్‌ తీవ్ర విమర్శలు చేశారు.

    ‘‘పెద్ద పెద్ద స్పాన్సర్లు మిమ్మల్ని గొప్పవాళ్లను చేయలేదు. మంచి ఆటే గొప్పవాళ్లను చేస్తుంది’’ అంటూ భారత జట్టు పేరు ప్రస్తావించకుండా మిర్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అయితే హమీద్ మిర్ ట్వీట్‌పై భారత్‌కు చెందిన వ్యాపారవేత్త తహసీన్ పూనావాలా స్పందించారు.

    పెద్ద స్పాన్సర్‌షిప్‌లు ఆటగాళ్లను గొప్పవాళ్లను చేయలేవన్న హమీద్ ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నానని ఆయన అన్నారు.

    కానీ, తన దేశంలో డబ్బు చాలా ఎక్కువగానే ఉందని, ప్రపంచంలో అతి పెద్ద జీడీపీ కలిగిన దేశాలలో భారత్ అయిదో స్థానంలో ఉందని తహసీన్ పూనావాలా తన ట్వీట్‌లో అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ‘‘మా పొరుగువాళ్లు డబ్బుల కోసం, స్పాన్సర్‌షిప్‌ల కోసం అడుక్కుంటున్నారు. కానీ, అడుక్కోవడం ఎప్పటికీ గొప్పవాళ్లను చేయదు’’ అని పూనావాలా తన ట్వీట్‌లో రాశారు.

  15. సెమీఫైనల్ ఓటమిపై మనసులో మాట చెప్పిన విరాట్ కోహ్లీ

    విరాట్ కోహ్లీ

    ఫొటో సోర్స్, @imVkohli

    ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.

    ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ ఓటమిపై సోషల్ మీడియాలో విమర్శలు, ఓదార్పులు కనిపిస్తున్నాయి. సీనియర్ క్రికెటర్ల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఓటమి స్పందిస్తున్నారు.

    చాలామంది జట్టుకు ఓదారుస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో ఓటమిపై భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కూడా తొలిసారి స్పందించారు.

    ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు వెళ్లే ముందు తన కల నెరవేరకుండానే నిరాశగా ఆస్ట్రేలియా నుంచి వెనక్కి వస్తున్నానని విరాట్ ట్వీట్‌ చేశాడు.

    ‘‘మా కల నెరవేరకుండానే ఆస్ట్రేలియా నుంచి తిరిగి వస్తున్నాం. కానీ, ఒక టీమ్‌గా భవిష్యత్తులో మేం అనేక మధుర స్మృతులను మోసుకొస్తాం. మా నుంచి మంచి పెర్ఫార్మెన్స్‌ను ఇస్తాం ’’ అని కోహ్లీ తన ట్వీట్‌లో రాశాడు.

    భారత జట్టు జెర్సీ ధరించడం ఎప్పుడూ గర్వంగా ఉంటుందని కోహ్లీ అన్నాడు.

    భారత జట్టుకు మద్దతుగా స్టేడియానికి భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులందరికీ విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మరోవైపు సెమీస్‌లో ఓటమి పాలైన భారత జట్టుకు ఓదారుస్తూ అనేకమంది సెలబ్రిటీలు ట్విటర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
    Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of Instagram ముగిసింది, 1

    పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
    Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of Instagram ముగిసింది, 2

  16. దివ్య అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించడంపై ఎందుకీ చర్చ?

  17. దక్షిణాదిలో తొలి వందేభారత్ సర్వీసు- ప్రారంభించిన ప్రధాని మోదీ

    వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

    ఫొటో సోర్స్, @narendramodi

    దక్షిణ భారత దేశంలోనే తొలి వందే భారత్ సర్వీసును ప్రధానమంత్రి నరేంద్రమోది శుక్రవారం నాడు ప్రారంభించారు.

    బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ఈ రైలును ప్రధాని ప్రారంభించారు.

    ఈ వందేభారత్ రైలు చెన్నై-మైసూరు నగరాల మధ్య నడుస్తుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ, శుక్రవారం నాడు బెంగళూరు నిర్మాత కెంపెగౌడ 108 అడుగుల విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు.

  18. ‘ట్విటర్ దివాలా తీసే అవకాశం ఉంది’-ఉద్యోగులతో ఎలాన్ మస్క్

    ఎలాన్ మస్క్

    ఫొటో సోర్స్, Getty Images

    ట్విట్టర్ దివాలా తీసే అవకాశం ఉందని ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ గురువారం తన ఉద్యోగులతో అన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    కంపెనీ దివాలా తీసే అవకాశాన్ని తోసి పుచ్చలేమని తన ఉద్యోగులకు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.

    ఉద్యోగులతో మొదటిసారి సమావేశం నిర్వహించిన మస్క్, తమ కంపెనీ వచ్చే ఏడాది వందల కోట్ల డాలర్లను నష్టపోవచ్చని హెచ్చరించారు.

    మరోవైపు ట్విటర్‌లో పరిణామాలపై అమెరికాకు చెందిన ఓ కీలక ఏజెన్సీ కూడా స్పందించింది.

    ట్విటర్‌లో ప్రైవసీ అండ్ కంప్లయన్స్ విభాగానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు నిష్క్రమించడం పట్ల అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

    ఇద్దరు సీనియర్ ట్విట్టర్ ఉద్యోగులు, జోయెల్ రోత్, రాబిన్ వీలర్‌ లు బుధవారం రాజీనామా చేశారు. గురువారం ట్విట్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా సమాచారం అందించారు.

    కంపెనీలో ప్రైవసీ అండ్ కంప్లయన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు తప్పుకుంటున్నట్లు ట్విటర్ నుంచి అందుతున్నన సమాచారం వెల్లడిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.