తాడేపల్లిగూడెం మండలంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు – ముగ్గురు మృతి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద సమీపంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. పశ్చిమగోదావరి: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురు మృతి

    బాణాసంచా కర్మాగారంలో పేలుడు

    ఫొటో సోర్స్, UGC

    పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించి నలుగురు వ్యక్తులు మరణించారని తాడేపల్లి గూడెం రూరల్ పోలీసులు బీబీసీకి వెల్లడించారు.

    తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు శబ్ధాలు, ప్రకంపనలు తాడేపల్లిగూడెం పట్టణం వరకూ వచ్చినట్లు తెలుస్తోంది.

    బాణాసంచా కర్మాగారంలో పేలుడు

    ఫొటో సోర్స్, UGC

    ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారని, అయితే, మృతుల సంఖ్య పెరగొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    బాణాసంచా కర్మాగారంలో పేలుడు

    ఫొటో సోర్స్, UGC

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ‘‘రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో 2 లక్షలమంది సైనికులు చనిపోయి ఉంటారు’’-అమెరికా జనరల్ వ్యాఖ్య

    యుక్రెయిన్ వార్‌లో ఓ సైనికుడు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ వార్‌లో ఓ సైనికుడు

    యుక్రెయిన్ యుద్ధంలో దాదాపు లక్షమంది రష్యన్ సైనికులు, మరో లక్షమంది యుక్రేనియన్ సైనికులు మరణించి, లేదా గాయపడి ఉంటారని యునైటెడ్ స్టేట్స్ ఛైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అంచనా వేశారు.

    ఈ యుద్ధంలో చిక్కుకుని 40వేలమంది సామాన్య పౌరులు మరణించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఇంతకు ముందు ఓ పశ్చిమ దేశాలకు చెందిన ఓ సీనియర్ అధికారి కూడా దాదాపు ఇదే అంచనా వేశారు.

    జనరల్ మార్క్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సీనియర్ సైనిక సలహాదారుగా పనిచేస్తున్నారు.

    రష్యాతో చర్చలను పునఃప్రారంభించేందుకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందని మిల్లీ అన్నారు.

    పుతిన్ అధికారంలో ఉండగా, రష్యాతో చర్చలు ఉండబోవని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ గతంలో స్పష్టం చేశారు. కానీ, ఇటీవలి రోజుల్లో చర్చలకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందంటూ ఆయన సంకేతాలు పంపుతున్నారు.

    మరోవైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 5,937 మంది సైనికులు మాత్రమే మరణించారని రష్యా సెప్టెంబర్‌లో తెలిపింది.

  4. రష్యాలో బందీగా ఉన్న భర్త కోసం ఎదురు చూస్తున్నయుక్రెయిన్ యువతి

  5. కులాలు లేని ఊరు

  6. కెంపెగౌడ: 4,000 కేజీల కత్తి సహా 220 టన్నులున్న ఈ విగ్రహం ఎవరిది - బెంగళూరులో మోదీ ఆవిష్కరిస్తున్న దీని వెనుక కుల రాజకీయాలున్నాయా

  7. జీ20 లోగోలో ‘కమలం’ ఏమిటి.. అసలు మోదీ, బీజేపీలకు సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు

  8. కేఎల్ రాహుల్: ఈ టీమిండియా ఓపెనర్‌పై ఎందుకింత ట్రోలింగ్

  9. ‘‘ భయ్యా, ఒక్క వికెట్ తీయలేకపోయారా?’’- భారత బౌలర్లపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు

    షోయబ్ అక్తర్

    ఫొటో సోర్స్, @shoaib100mph

    ఇంగ్లండ్‌పై భారత్‌ బౌలింగ్‌పై పాకిస్తాన్ క్రికెట్‌ జట్టు స్టార్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ట్వీట్‌ చేశాడు.

    "భయ్యా, మీరు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారా?" అని రాశాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మరో ట్వీట్‌లో ‘తొలి బంతి నుంచే ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. 10 ఓవర్లలో 100 పరుగులు చేయడం అద్భుతం’ అని పేర్కొన్నాడు.

  10. INDvsENG: రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.

  11. కేరళలో 32,000 మంది మహిళలు మతం మారి, ఇస్లామిక్ టెర్రరిస్టులు అయ్యారా? అదా శర్మ సినిమాపై వివాదం ఎందుకు?

  12. భీమా-కోరెగావ్ కేసు: గౌతమ్ నవ్‌లఖాకు నెలరోజుల హౌస్ అరెస్ట్‌-సుప్రీంకోర్టు అనుమతి

    గౌతమ్ నవ్‌లఖా

    ఫొటో సోర్స్, Getty Images

    భీమా కోరెగావ్ కేసులో ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న గౌతమ్ నవ్‌లఖాను నెల రోజులు పాటు హౌస్ అరెస్టులో ఉంచేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

    ఆరోగ్యం, వయసు కారణాలతో తనను నెల రోజులపాటు హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

    ఇందుకోసం నవ్‌లఖా రూ.2.4 లక్షలు ఖర్చులు చెల్లించాలని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

    నవ్‌లఖాను ఎక్కడ హౌస్ అరెస్టులో ఉంచాలో 48 గంటల్లో నిర్ణయించాలని ఎన్ఐఏకు సుప్రీం కోర్టు సూచించింది.

    రోజుకు పది నిమిషాలపాటు పోలీసులు ఇచ్చిన మొబైల్ ఫోన్‌ను ఇతర మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్ టాప్‌లు మరే ఇతర కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగించడానికి వీలు లేదని నవ్‌లఖాకు సుప్రీం కోర్టు షరతు విధించింది.

  13. INDvsENG: ఇంగ్లండ్ కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇండియా

    ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

    ఫొటో సోర్స్, Getty Images

    అడిలైడ్‌లో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

    ఆరంభం నుంచి నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండో ఓవర్‌లో మొదటి వికెట్ కోల్పోయింది.

    జట్టు స్కోరు 10 పరుగుల వద్ద కె.ఎల్.రాహుల్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి అతడు అయిదు బంతుల్లో 5 పరుగులు చేశాడు.

    ఆ తర్వాత రోహిత్ శర్మ(27), సూర్య కుమార్ యాదవ్ (14) విరాట్ కోహ్లీ (50) పరుగులకు అవుటయ్యారు. రిషబ్ పంత్ 6 పరుగులు చేసి అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా (63) పరుగులు చేసి చివరి బంతికి అవుటయ్యాడు.

  14. నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ -విరాట్(50) అవుట్

    అడిలైడ్‌లో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు రెండో ఓవర్‌లో మొదటి వికెట్ కోల్పోయింది.

    జట్టు స్కోరు 10 పరుగుల వద్ద కె.ఎల్.రాహుల్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి అతడు ఐదు బంతుల్లో 5 పరుగులు చేశాడు.

    ఆ తర్వాత రోహిత్ శర్మ(27), సూర్య కుమార్ యాదవ్ (14) విరాట్ కోహ్లీ (50) పరుగులకు అవుటయ్యారు.

  15. INDvsENG: సెమీ ఫైనల్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్‌కు దిగిన భారత్

    భారత క్రికెట్ అభిమానులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంటులో భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానంలో మొదలైంది.

    భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

    భారత్ జట్టు నుండి రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్‌లు బ్యాటింగ్‌కు దిగారు.

    భారత జట్టు: కె.ఎల్.రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్.

    ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్ (డేవిడ్ మలాన్ స్థానంలో చేరిక), బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ (మార్క్ ఉడ్ స్థానంలో చేరిక).

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోయారా?

    సానియా మీర్జా, ఇఝాన్ మీర్జా మాలిక్, షోయబ్ మాలిక్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, సానియా మీర్జా, ఇఝాన్ మీర్జా మాలిక్, షోయబ్ మాలిక్

    టెన్నిస్ సూపర్‌స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త షోయబ్ మాలిక్‌లు విడిపోయారన్న వదంతులు జోరుగా వినిపిస్తున్నాయి.

    పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ తార సానియా మీర్జాలు తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించారని, అయితే తమ కొడుకు ఇఝాన్ మీర్జా మాలిక్‌కు తల్లిదండ్రులుగా ఉన్నారని తెలుస్తోందని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    పాకిస్తానీ వార్తా సంస్థ సామా టీవీ కథనం ప్రకారం.. షోయబ్ మాలిక్ సానియాను మోసం చేశారు.

    దీనికి సంబంధించి సానియా కానీ, షోయబ్ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

    ఆసక్తికరంగా సానియా, షోయబ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. అయితే.. సానియా పోస్టులు, కాప్షన్లు, స్టోరీలు విడాకుల వదంతులకు ఆజ్యం పోశాయి.

    ఇటీవల సానియా తన కొడుకుతో కలిసివున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘‘నన్ను కఠినమైన రోజులు గట్టెక్కేలా చేసే క్షణాలు’’ అని రాశారు.

    పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
    Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of Instagram ముగిసింది

    కొన్ని రోజుల కిందట ‘బద్దలైన హృదయాలు ఎటు పోతాయి?’ అంటూ ఆమె ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశారు.

    మరో ఆసక్తికరమైన విషయం.. సానియా ఇటీవల దుబాయిలోని కొత్త నివాసానికి మకాం మార్చినట్లు కథనాలు వచ్చాయి.

    ఇంతకుముందు సానియా మీర్జా దుబాయిలోని పామ్ జుమేరాలో షోయబ్‌ మాలిక్‌తో కలిసి నివసించేవారు. అయితే ఇప్పుడు ఆమె దుబాయిలోనే వేరే ప్రాంతానికి మారారు.

    సానియా సోదరి ఆనమ్ మీర్జా ఇటీవల సానియా, షోయబ్‌ల కుమారుడు ఇజాన్ పుట్టిన రోజు వేడుకలను రికార్డు చేసి పోస్టు చేశారు. ఆ పార్టీకి షోయబ్ కూడా హాజరయ్యారు.

    ఆ పుట్టిన రోజు పార్టీ ఫొటోలను షోయబ్ కూడా షేర్ చేశారు. కానీ సానియా షేర్ చేయలేదు.

    అలాగే ఇటీవల ‘ఆస్క్ ద పెవిలియన్’ అనే పాకిస్తానీ క్రికెట్ షోలో పాల్గొన్న షోయబ్‌ను.. సానియా టెన్నిస్ అకాడమీలు ఎక్కడున్నాయనే ప్రశ్న అడగగా.. ఆ అకాడమీల గురించి తనకు పెద్దగా తెలియదని షోయబ్ బదులిచ్చారు.

    దీనికి ఆశ్చర్యపోయిన వకార్ యూనిస్.. ‘‘నువ్వేం భర్తవి?’’ అంటూ జోక్ చేశారు.

    షోయబ్, సానియాలు 2010లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచీ వారు దుబాయ్‌లో నివసిస్తున్నారు.

    సానియా మీర్జా తాను టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. అమెరికా ఓపెన్ టెన్నిస్‌ టోర్నీకి కొన్ని వారాల ముందు కెనడాలో తనకు గాయమైనందువల్ల ఆగస్టులో అమెరికా ఓపెన్ నుంచి ఆమె తప్పుకున్నారు.

    షోయబ్ మాలిక్ 2021 నవంబర్‌లో బంగ్లాదేశ్ మీద టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడారు. ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టిలో లేకపోవటంతో ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు.

  17. భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో జంబోజెట్ నుంచి రాకెట్ ప్రయోగం

  18. అమెరికా: ర్యాన్ డిశాంటిస్ మరొక డోనల్డ్ ట్రంపా? తనపై పోటీ చేయొద్దని ట్రంప్ ఆయనను ఎందుకు హెచ్చరిస్తున్నారు?

  19. తెలంగాణ ‘ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం’ కేసుపై సిట్ ఏర్పాటు

    ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించాలని ప్రలోభానికి గురిచేశారన్నది ఆరోపణ

    తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ ఉదంతం మీద దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు.

    తాండూరు శాసనసభ సభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కొందరు వ్యక్తుల మీద రాపూర్వక ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 120-బి, 171-బి, 171-ఇ, 506 తో పాటు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 కింద మొయినాబాద్ పీఎస్‌లో కేసు (నంబర్ 455/2022) నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీజీపీ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.

    ఈ కేసు సున్నితమైనది, ఉన్నతస్థాయికి చెందినది, సంచలనాత్మకమైనది కావటంతో పాటు, పలు కోణాల్లో విస్తృతంగా దర్యాప్తు చేయవలసి ఉంటుందని.. కాబట్టి దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

    ఈ సిట్‌కు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ సారథ్యం వహిస్తారని, నల్గొండ ఎస్‌పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీలు కాల్మేశ్వర్ షింగేనవర్, ఆర్.జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ బి.గంగాధర్, నారాయణ్‌పేట్ ఎస్‌పీ ఎన్.వెంకటేశ్వర్లు, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ లక్ష్మి రెడ్డిలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.

    డీజీపీ ఉత్తర్వు
  20. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరబిందో ఫార్మా ఎండీ అరెస్ట్?

    మద్యం

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22, మనీ లాండరింగ్ కేసులో అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

    వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపనీలో కీలక డైరెక్టర్ స్థానంలో కొనసాగుతున్నారు.

    గతంలోనూ పలుమార్లు ఆయనను ఈడీ ప్రశ్నించింది.

    హైదరాబాద్, దిల్లీ నగరాల్లోని శరత్ చంద్రారెడ్డి ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

    అరెస్ట్ చేసిన ఇద్దరిని ఈరోజు మద్యాహ్నం ఈడీ కోర్టులో హాజరుపరచనున్నట్టుగా సమాచారం.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది