గోరుచిక్కుడు గమ్: భారత్ నుంచి అమెరికా భారీగా దిగుమతి చేసుకునే ఈ 'గ్వార్ గమ్' ఏమిటి?

వీడియో క్యాప్షన్, భారత్‌లో గోరు చిక్కుడుతో తయారయ్యే 'గ్వార్ గమ్' ఏంటి, అమెరికాకు ఇది ఎంత ముఖ్యం?
గోరుచిక్కుడు గమ్: భారత్ నుంచి అమెరికా భారీగా దిగుమతి చేసుకునే ఈ 'గ్వార్ గమ్' ఏమిటి?

గోరు చిక్కుడు. మనకు ఆహారంలో ఉపయోగపడే కూరగాయే కాదు, భారత్‌కు మిలియన్ డాలర్లు కూడా సంపాదించి పెడుతోంది. అమెరికాకు పెద్దఎత్తున ఎగుమతీ అవుతోంది.

పాకిస్తాన్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఆఫ్రికాల్లో కూడా గ్వార్‌‌ను సాగు చేస్తారు. కానీ, గ్వార్ ఉత్పత్తిలో 80 శాతం భారత్ నుంచే అవుతున్నట్లు అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవెలప్‌మెంట్ అథారిటీ (అపెడా) గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని గ్వార్ ఉత్పత్తిలో, 72 శాతం రాజస్థాన్ నుంచి ఉత్పత్తి అవుతోంది.

గుజరాత్, రాజస్థాన్, హరియాణాతో పాటు మహారాష్ట్రలోనూ గ్వార్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లోనూ ఈ పంట పండిస్తారు.

గోరు చిక్కుడు, అమెరికా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)