టైటానిక్ సబ్: చివరి క్షణంలో ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, టైటాన్ సబ్: పేలిపోవడానికి ముందు చివరి క్షణంలో ఏం జరిగింది?
టైటానిక్ సబ్: చివరి క్షణంలో ఏం జరిగింది?

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలు చూడ్డానికి మినీ జలాంతర్గామి టైటాన్‌లో ప్రయాణించిన ఐదుగురూ మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది.

భయంకరమైన పేలుడుతోనే వీరు మరణించి ఉంటారని అమెరికా కోస్ట్ గార్డు భావిస్తోంది.టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో ఈ జలాంతర్గామి శకలాలను గుర్తించారు.

టైటానిక్ యాత్రకు బయలుదేరిన ఈ జలాంతర్గామి ఆదివారం నుంచి సముద్రంలో కనిపించకుండా పోయింది.

ఈ సబ్‌లో ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ ఉన్నారు. దీనిలోని ఐదో వ్యక్తి 77 ఏళ్ల పాల్ హెన్రీ నార్గోలెట్. ఆయన మాజీ ఫ్రెంచ్ నావీ డ్రైవర్, ప్రముఖ అన్వేషకులు.

titanic sub

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)