ఇజ్రాయెల్‌ బాంబు దాడుల తర్వాత తెహ్రాన్‌లో పరిస్థితులను చూపించే 7 ఫోటోలు..

ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్‌లో తమ వీధిలో భారీ ఎత్తున బాంబులు పేలి విధ్వంసం జరగడంతో భయంతో చూస్తున్న స్థానికుడు. ఇజ్రాయెల్ దాడులతో చాలామంది తెహ్రాన్‌ని విడిచిపెడుతున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ మొదట్లో అణు కేంద్రాలు, ఉన్నత స్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆ తర్వాత నివాస ప్రాంతాలతో సహా రాజధానిపై అనేకసార్లు బాంబులు కురిపించింది. ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.
పెట్రోల్ బంక్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ ఆదేశించకముందే.. చాలా మంది ప్రజలు ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో పెట్రోల్ బంక్‌ల బయట ఇంధనం కోసం కార్లు బారులుతీరిన దృశ్యం.
ది లాస్ట్ ఫోటోస్ ఆఫ్ హోమ్

ఫొటో సోర్స్, Social media

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్ నుంచి బయలుదేరిన ప్రజలు తాము తిరిగి వస్తామో, లేదో అన్న సందిగ్థతతో చివరిసారిగా తమ ఇళ్ల ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'ది లాస్ట్ ఫోటోస్ ఆఫ్ హోమ్' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
నివాస ప్రాంతాలు

ఫొటో సోర్స్, Xinhua/Shutterstock

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్ నుంచి ప్రజలు వలస వెళ్లపోతుండడంతో నివాసప్రాంతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
గ్రాండ్ బజార్‌

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్‌లో సోమవారం నాడు షాపులన్నీ ఇలా మూతపడి కనిపించాయి.
 ట్రాఫిక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ బాంబుదాడుల కారణంగా భయాందోళనలకు గురైన ప్రజలు ఒక్కసారిగా తెహ్రాన్‌ను వీడడంతో రోడ్లపై గంటలతరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)