పరుగెత్తుతూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చుట్టేస్తున్న అన్న , తమ్ముడు

వీడియో క్యాప్షన్, అరుదైన సాహసాన్ని పూర్తి చేసేందుకు కఠోర శిక్షణ
పరుగెత్తుతూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చుట్టేస్తున్న అన్న , తమ్ముడు
    • రచయిత, స్టీఫెన్ మెక్ డోనల్డ్
    • హోదా, బీబీసీ చైనా ప్రతినిధి

బ్రిటిష్ తండ్రి, చైనా తల్లి.. వారి ఇద్దరి పిల్లలు.. కొద్ది మంది పూర్తి చేసే సుదీర్ఘ ప్రయాణానికి మధ్యలో ఉన్నారు.

ఆరు నెలల పాటు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మొత్తాన్ని మారథాన్ రన్నింగ్‌తో పూర్తిచేయడానికి సిద్ధపడ్డారు.

ఎడారులు, కొండలు, అక్కడక్కడా రాలిపడే శిధిలాల మధ్య నుంచి ప్రతీ రోజూ పరుగు పెడుతున్నారు.

చాలా మంది కనీసం ఆలోచించని ఇలాంటి సాహసాన్ని వీళ్లిద్దరూ చేపట్టడం వెనక వీరి కోచ్ ఉన్నారు.

1988లో వీళ్ల తండ్రి స్థానికుల ఆతిథ్యంతో గ్రేట్ వాల్‌పై పరుగును పూర్తిచేశారు. అప్పట్లో బీబీసీ దానిని చిత్రీకరించింది.

ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకుని చైనాలోనే ఉండిపోయారు. ఇప్పుడాయన కొడుకులు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

వీళ్లిద్దరూ పశ్చిమ శివార్లో రాళ్లు మట్టితో నిర్మించబడ్డ దుర్బేధ్యమైన గోడపై మొదలు పెట్టి, ఉత్తర కొరియా సరిహద్దు వరకూ పరుగెత్తుతారు.

వారి కుటుంబం నివాసముండే ప్రాంతం మీదుగా పరుగెత్తుతూ వాళ్ల నాన్నను కలుస్తారు.

వారిద్దరికీ చిన్నప్పటి నుంచీ గ్రేట్ వాల్ గురించి అనేక విశేషాలను ఆయన చెబుతూవచ్చారు.

చైనాలోని నిర్మానుష్య ప్రదేశాలను చుడుతూ సాగే ఈ చరిత్రాత్మక పరుగు అమూల్యమైంది.

Great wall of China

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)