అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెబుతారు? అమ్మాయా? అబ్బాయా?

అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెబుతారు? అమ్మాయిలా? లేక అబ్బాయిలా? వృద్ధులా లేక యువతా? సమాధానం తెలియాలంటే ఈ అధ్యయనం గురించి తెలుసుకోవాల్సిందే.
మ్యాక్స్ ప్లాంక్ అండ్ టెక్నియాన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ జర్మనీ, ఇజ్రాయెల్ ఇటీవల ఓ అధ్యయాన్ని నిర్వహించాయి.
అందులో అమ్మాయిలకన్నా అబ్బాయిలే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని తేలింది.
అలాగని మహిళలంతా నిజమే చెబుతారని కాదు.
అధ్యయనంలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది అబ్బాయిలు అబద్ధాలు చెప్పారు.
అదే అమ్మాయిలైతే 38 శాతం మంది అబద్ధాలు చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
44,000 మందికి సంబంధించిన 565 అధ్యయనాల్లో తేలిన విషయమిది.
మరి ఎవరి కళ్లు ఎక్కువ నిజాయతీగా కనిపిస్తాయి?
వృద్ధులతో పోల్చితే యువత ఎక్కువ అబద్దాలు చెబుతుందట.
వయసు పెరుగుతున్న కొద్దీ ఏటా 0.28 శాతం పాయింట్ల చొప్పున మనలో నిజాయితీ పెరుగుతుందట.
అదండీ సంగతి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








