You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మిస్ అర్జెంటీనా, మిస్ పుయెర్టోరీకో: 'ఔను... మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాం'
మాజీ మిస్ అర్జెంటీనా, మాజీ మిస్ పుయెర్టోరీకో పెళ్ళి చేసుకున్నారు. తాము పెళ్ళి చేసుకున్నామని వారు ఇన్‌స్టాగ్రామ్‍లో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అర్జెంటీనాకు చెందిన మరియానా వారెలా, పుయెర్టోరీకోకు చెందిన ఫాబియోలా వాలెంటిన్ ఇద్దరూ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2020 ఈవెంట్‌లో కలుసుకున్నారు. ఆ అందాల పోటీలలో వారు ఆ ఏడాదికి తమ తమ దేశాల తరఫున చాంపియన్స్‌గా నిలిచారు.
థాయిలాండ్‌లో జరిగిన ఆపోటీలలో వారిద్దరూ టాప్-10 దశకు చేరుకున్నారు. ఆ సమయంలోనే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారని సీఎన్ఎన్ తెలిపింది.
పీపుల్ మ్యాగజీన్ కథనం ప్రకారం, ఈ అందాల భామలు ఆదివారం నాడు స్పానిష్ భాషలో తమ పెళ్ళి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
"మా అనుబంధాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాం. అయితే, ఒక స్పెషల్ రోజున ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం. అదే 28 అక్టోబర్" అని ఆ పోస్ట్‌లో రాశారు.
ఈ సందర్భంగా 26 ఏళ్ళ వారెలా కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. వారు కలుసుకున్నప్పుడు, ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నప్పుడు, స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు తీసిన ఫోటోలు అందులో ఉన్నాయి.
సీఎన్ఎన్ వార్తా కథనం ప్రకారం ఈ ఇద్దరు అమ్మాయిలు పుయెర్టోరీకోలోని సాన్ జువాన్ నగరంలో అక్టోబర్ 28న పెళ్ళి చేసుకున్నారు.
స్నేహితులు, అందాల పోటీల విజేతలు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2020 (ఎంజీఐ) విజేత అయిన ఘనా గాయకురాలు అబెనా అకువాబా వారికి ధన్యవాదాలు చెబుతూ, "ఎంజీఐ ఓ గొప్ప కలయికకు వేదికైంది" అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)