Sri Lanka Protests: దేశాధ్యక్షుడి ఇంటిపై ప్రజల దండయాత్ర.. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టిన నిరసనకారులు
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ అధికారిక నివాసాన్ని నిరసనకారులు ముట్టడించడంతో కొలంబోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ఇవాళ మధ్యాహ్నం అధ్యక్ష భవనంలోకి చేరుకున్నారు. అంతకు ముందు వేలాదిమంది నిరసనకారులు అధ్యక్ష భవనంవైపు దారి తీసే వీధుల్లో గుమిగూడి ఆందోళనలు చేశారు. కానీ, వారు లోపలికి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాడు చేశారు. వేల సంఖ్యలో గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చివరికి టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన జనం మళ్లీ కాసేపట్లోనే మళ్లీ గుమిగూడారు.
నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో నివాసంలోకి రావడానికి ప్రయత్నించిన వారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరుపుతున్న శబ్దాలు కూడా వినపించాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు మధ్యాహ్నం ఒంటి గంటకు నిరనసకారులు పోలీసులపై పైచేయి సాధించి అధ్యక్ష భవనం లోపలికి ప్రవేశించడం ప్రారంభించారు. అధికారిక నివాసంలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్లో స్నానాలు కూడా చేశారు. దీంతో పోలీసు సిబ్బంది అక్కడ నుంచి తప్పుకున్నారు. కొంతమంది నిరసనకారులు ప్రధాన గేటు ఎక్కి లోపలికి వెళ్లారు. నిరనసలు జరుగుతున్న ప్రాంతాల్లో సైన్యాన్ని కూడా మోహరించారు. ప్రస్తుతం అధ్యక్షుడు గోటబయ రాజపక్ష అధికారిక నివాసంలో ఉన్నారా లేదా అనేదానిలో స్పష్టత లేదు. ఈరోజు ఉదయం టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల గాయపడిన చాలా మందిని ఆస్పత్రులకు తరలించడం కూడా కనిపించింది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత తీవ్రం కావడంతో దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్ష, ప్రధాని రణిల్ విక్రమసింఘెకు వ్యతిరేకంగా నిరనసలు తీవ్రం అయ్యాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న జనం ఈరోజు భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు ఈ నిరసనలకు మద్దతు తెలిపాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థి సంఘాలు శుక్రవారం నుంచి రాజధాని కొలంబోకు చేరుకోవడం మొదలైంది. శనివారం ఉదయం కూడా భారీ సంఖ్యలో వాహనాల్లో నిరసనకారులు నగరానికి చేరుకున్నారు. కొందరు కాలినడకన, సైకిళ్లపై కూడా కొలంబోకు వచ్చారు.
కొలంబోలోని గాలే క్రికెట్ స్టేడియం బయట కూడా నిరనసకారులు పెద్దఎత్తున గుమిగూడారు. ఇక్కడ శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- రోడ్డెక్కిన శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య: ‘నీ కోట కూలిపోయింది.. ఈ రోజే వెళ్లిపో’
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్
- ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్ కాల్తో చైనా ఎందుకు కలవరపడుతోంది?
- Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
- వైసీపీ నుంచి విజయమ్మ తప్పుకున్నారా, తప్పించారా? ప్లీనరీ వేదిక మీదే ఎందుకు రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?
- గొటాబయ రాజపక్ష: అధికారిక నివాసం వదిలేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
- Investment: మ్యూచువల్ ఫండ్స్ నుంచి రుణం తీసుకొని ఇల్లు కొనుక్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)