హోటళ్లలో మిగిలే ఆహారంతో పేదల కడుపు నింపుతున్నారు

వీడియో క్యాప్షన్, హోటళ్లలో మిగిలే ఆహారంతో పేదల కడుపు నింపుతున్నారు

ఒకవైపు ఆకలికేకలు, మరోవైపు ఆహార వృథా.

ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలోని ఈ షెఫ్‌లు హోటళ్లు, మార్కెట్లలో మిగిలిపోయే కూరగాయలను సేకరించి ఆహారాన్ని సిద్ధం చేసి ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపుతున్నారు.

కొందరు షెఫ్‌లు ఒక బృందంగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారు.

ఆహారం ఎక్కడెక్కడ వృథా అవుతుందో గుర్తించి దాన్ని అవసరమైన వారికి అందించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

దీంతో వృథా కావాల్సిన ఆహారంలో చాలావరకు అవసరమైనవారికి చేరుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)