ఆ ఊళ్లో ఎవరి అంత్యక్రియలైనా చితి దగ్గర ఆమె పూజలు చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి ఏడు కిలోమీటర్ల దూరంలోని చిట్టత్తూరులో పూర్వీకుల నుంచి వచ్చిన జంగం దేవర వృత్తిని కాటమ్మ వారసత్వంగా స్వీకరించారు.
40 ఏళ్ల కాటమ్మ ఆ ఊరికే కాదు, చుట్టుపక్కల ఐదారు గ్రామాలకు కూడా జంగం దేవరగా పనిచేస్తుంటారు. తరచూ శ్రీకాళహస్తిలో జరిగే అంత్యక్రియలకు కూడా వెళ్తుంటారు.
వారసత్వంగా వచ్చిన రెండు కిలోల బరువున్న ఇత్తడి గంటను.. ఊరికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న శ్మశానం వరకూ ఆపకుండా వాయించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ, కాటమ్మ గత 11 ఏళ్లుగా అదే పని చేస్తున్నారు.
చాలా గ్రామాల్లోలాగే చిట్టత్తూరులో కూడా మహిళలు శ్మశానం వరకూ వెళ్లరు. కానీ, కాటమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి వారసత్వం అందుకోవాల్సి వచ్చింది.
పదో తరగతి తర్వాత కాటమ్మ చదువు ఆపేసిన అమ్మనాన్నలు ఆమెకు 16 ఏళ్లకే పెళ్లి చేసేశారు. కానీ, ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగలేదు.
"ఆ వయసులో పెళ్లి చేసుకోవచ్చా, లేదా అని అప్పట్లో తెలీదు.. అమ్మనాన్నలు చేసేశారు. కానీ, తర్వాత కొన్ని రోజులకే ఆయన తాగుడు గురించి తెలిసింది. ఇద్దరు పిల్లలు పుట్టినా ఆయన తీరు మారలేదు. తాగుడు కోసం బంగారం, ఇంట్లో వస్తువులు కూడా అమ్మేసేవాడు. బిడ్డల కోసం కష్టపడదామనే ఉద్దేశమే ఉండేది కాదు. దాంతో విడిపోదామని నిర్ణయించుకున్నా. రెండు కుటుంబాలవారు, ఇంకా చాలా మంది మాకు మధ్యవర్తిత్వం చేశారు. కానీ నేను చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు.. పుట్టింటికి వచ్చేశా" అని కాటమ్మ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


