కల్పన చావ్లా మృతికి కారణమైన స్పేస్ క్రాఫ్ట్ ఎందుకు కూలిపోయింది
పదహారు రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో మళ్లీ భూమికి పయనమైంది కల్పనా చావ్లా బృందం. బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్‌కు సంబంధించి ఆస్ట్రోనాట్స్ చేసిన భద్రతా పరీక్షల్లో అంతా సవ్యంగానే కనిపించింది.
భూమికి సుమారు 282 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. భారత కాలమానం ప్రకారం అప్పుడు సమయం సాయంత్రం సుమారు 6 గంటల 40 నిమిషాలు అవుతోంది. భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు.. అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించింది స్పేస్ క్రాఫ్ట్.
ఇంత వరకు ప్రయాణం బాగానే సాగింది. కానీ ఆ తరువాత కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ నుంచి అబ్‌నార్మల్ రీడింగ్స్ నాసా మిషన్ కంట్రోల్ రూమ్‌కు రావడం మొదలైంది. స్పేస్ క్రాప్ట్ ఎడమ రెక్కలో ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి సమాచార ప్రసారం నిలిచి పోయింది. స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్‌కు సంబంధించిన డేటా కూడా కనిపించకుండా పోయింది.
దాంతో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ సిబ్బందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నించింది మిషన్ కంట్రోల్ రూం. 7 గంటల 29 నిమిషాల ప్రాంతంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లోని మిషన్ కమాండర్, రిక్ హజ్‌బెండ్ నుంచి రెస్సాన్స్ వచ్చింది.
కానీ అది 'రోజర్' అనే ఒక్క పదంతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత కొద్ది సెకన్లకు మిషన్ గ్రౌండ్ కంట్రోల్ రూంతో కొలంబియాకు పూర్తి సంబంధాలు తెగిపోయాయి. ఎంత ప్రయత్నించినా తిరిగి కమ్యూనికేట్ కాలేక పోయారు.
చివరకుసాయంత్రం 7 గంటల 32 నిమిషాల ప్రాంతంలో అమెరికా మీద సుమారు 61 కిలోమీటర్ల ఎత్తులో కాలి పోయి ముక్కలుగా విడిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్: సైనిక పాలనపై సామాన్యుల పోరాటం సివిల్ వార్‌గా మారుతోందా
- 'పనికిమాలిన, పసలేని బడ్జెట్.. కోవిడ్ వినాశనం చూశాకైనా ఆరోగ్య రంగానికి నిధులు పెంచరా'- కేసీఆర్
- కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యాంశాలు: నదుల అనుసంధానం, కిసాన్ డ్రోన్లు, డిజిటల్ రూపీ
- మీ దగ్గర స్టార్టప్ పెట్టే టాలెంట్ ఉంటే 50 లక్షల వరకూ నిధులు.. రూ. 5 కోట్ల వరకూ గ్రాంటు పొందండి ఇలా..
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

