బీబీసీ 100 మంది మహిళలు 2021
2021 సంవత్సరానికిగానూ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబితాను బీబీసీ విడుదల చేసింది.
మన సమాజాన్ని, సంస్కృతిని, మొత్తంగా మన ప్రపంచాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్న మహిళల గురించి ఈ ఏడాది '100 మంది మహిళామణులు' ప్రముఖంగా ప్రస్తావించింది.
అతి పిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్‌జాయ్, సమోవా మొదటి మహిళా ప్రధాన మంత్రి ఫియామె నవోమి మటాఫా, వ్యాక్సీన్ కాన్ఫిడెన్స్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ హెడీ జె లార్సన్, ప్రఖ్యాత రచయిత చిమామందా ఎన్‌గోజి అడిచి వంటి వారు ఈ ఏడాది జాబితాలో ఉన్నారు.
ఈ జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు కూడా ఉన్నారు. ఒకరు మంజుల ప్రదీప్, మరొకరు ముగ్దా కల్రా.
ఈ సంవత్సరం జాబితాలో సగం మంది అఫ్గానిస్తాన్‌కు చెందిన మహిళలే. వీరిలో కొందరు తమ భద్రత కోసం మారుపేర్లతో, ఫొటోలు లేకుండా కనిపిస్తారు.

100 మంది మహిళలు... అంటే ఏంటి?
బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.
( #BBC100Women హ్యాష్‌ట్యాగ్ వాడి మీరూ ఈ చర్చలో భాగం కావొచ్చు.)
ఇవి కూడా చదవండి:
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- తదుపరి మహమ్మారి కోవిడ్ కంటే ప్రాణాంతకంగా ఉంటుందా
- సమంత: ‘చైతూతో విడిపోయాక చనిపోతానేమో అనిపించింది..’
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
- మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- బీబీసీ 100 మంది మహిళలు 2021: జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..
- నాగాలాండ్ హింస: 70 ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ ఉద్యమ చరిత్ర ఏంటి?
- వసీం రిజ్వీ ఇప్పుడు జితేంద్ర త్యాగి అయ్యారు.. ఇస్లాం విడిచిపెట్టి హిందువుగా మారారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)