చైనా జైలు నుంచి తప్పించుకున్న ఉత్తర కొరియా దొంగ

వీడియో క్యాప్షన్, చైనా జైలు నుంచి తప్పించుకున్న ఉత్తర కొరియా దొంగ

39 ఏళ్ల జు జియాన్‌జియాన్ అనే ఉత్తర కొరియా దేశస్తుడు చైనాలోని ఒక జైలు నుంచి ఎంతో ధైర్యం చేసి తప్పించుకున్నాడు.

ఉత్తర చైనాలోని జిలిన్ నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జు జియాన్‌జియాన్ ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా 2013వ సంవత్సరంలో చైనాలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఉత్తర కొరియా-చైనాల మధ్య ప్రవహించే నదిని దాటుకుని అతను చైనా వచ్చాడు.

వెంటనే స్థానిక చైనా గ్రామంలోని అనేక ఇళ్లపై దాడి చేసి డబ్బు, మొబైల్ ఫోన్లు, బట్టలు దొంగిలించాడు. ఒక వృద్ధ మహిళను అతను కత్తితో పొడిచి టాక్సీలో పారిపోవడానికి ప్రయత్నించాడు.

దీంతో న్యాయస్థానం అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

జిలిన్ నగరంలోని జైలులో అతను 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. మరో 2 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే మిగిలి ఉంది.

జు జియాన్‌జియాన్

ఫొటో సోర్స్, JILIN POLICE

ఫొటో క్యాప్షన్, జు జియాన్‌జియాన్

మరి ఇప్పుడు అతను ఎందుకు జైలు నుంచి తప్పించుకున్నాడు?

చైనా తమ దేశంలోకి చొరబడే ఉత్తర కొరియా దేశస్తులను బలవంతంగా వెనక్కు పంపిస్తోంది.

అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించే ఉత్తర కొరియన్లను శరణార్థులుగా గుర్తించట్లేదు.

తన జైలు శిక్ష పూర్తయితే మళ్లీ తనను ఉత్తర కొరియాకు పంపిస్తారనే జు జియాన్‌జియాన్ జైలు నుంచి పారిపోయే సాహసం చేశాడని కొందరు స్థానికులు చెబుతున్నారు.

జైలు నుంచి తప్పించుకున్న నేరానికి ఇప్పుడు జు జైలు శిక్ష మరింత పెరుగుతుందా? బహుశా అతను అదే కోరుకుంటున్నాడా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)