పర్యావరణానికి హాని లేకుండా సెక్స్ చేయడం ఎలా?

వీడియో క్యాప్షన్, పర్యావరణానికి హాని లేకుండా సెక్స్ చేయడం సాధ్యమేనా?

కార్బన్ ఫుట్ ప్రింట్స్ గురించి మాట్లాడేటప్పుడు మన లైంగిక జీవితానికి సంబంధించిన విషయాలు అందులో ఎక్కువగా ఉండవు. అయినా సరే, పర్యావరణ అనుకూల కండోమ్‌లు, వ్యర్థాలు లేని గర్భ నిరోధక మాత్రలపై ఆన్‌లైన్‌లో సెర్చ్ జరుగుతూనే ఉంది.

"కొందరికి, ఎకో-ఫ్రెండ్లీ సెక్సువల్‌గా ఉండటం.. అంటే భూమి మీద తక్కువ ప్రభావం చూపే లూబ్రికెంట్లు, బొమ్మలు, బెడ్‌షీట్లు, కండోమ్‌లను ఎంచుకోవడం'' అని నైజీరియాకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ అడెనికే అకిన్‌సెమోలు వివరించారు.

ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం ఏటా సుమారు వెయ్యి కోట్ల కండోమ్‌లు తయారు చేస్తున్నారు. ఇవన్నీ చివరకు చెత్తకుప్పల్లో చేరతాయి.

వీటి వల్ల పర్యావరణానికి నష్టం ఉంది. ఎందుకంటే ఇవి సింథటిక్ రబ్బరు, ఇతర రసాయనాలతో కలసి తయారవుతాయి. రీ సైకిల్ చేయడం సాధ్యం కాదు.

రోమన్ల కాలం నుండి ఉపయోగిస్తున్న లాంబ్‌స్కిన్ కండోమ్‌లు మాత్రమే పూర్తిగా బయో డిగ్రేడబుల్ కండోమ్‌లు. కానీ, అవి గొర్రెల పేగు నుంచి తయారవుతాయి. ఇవి లైంగికంగా సంక్రమించే అంటు వ్యాధులను నిరోధించలేవు.

అనేక లూబ్రికెంట్లు కూడా పెట్రోలియం ఆధారితమైనవి. అంటే వీటిలో శిలాజ ఇంధనాలు ఉంటాయి. ఈ పరిణామాలు నీటి ఆధారిత లేదా సేంద్రియ ఉత్పత్తుల పెరుగుదలకు దారి తీసింది. ఇంట్లో తయారు చేసుకునే ఆప్షన్లకు జనాదరణ పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)