You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈజిఫ్ట్: తేళ్లు కుట్టడంతో ముగ్గురు మృతి, వందల మంది ఆస్పత్రి పాలు - Newsreel
ఈజిఫ్టులోని అస్వాన్ నగరంలో భారీ తుఫాను తర్వాత వీధుల్లోకి కొట్టుకొచ్చిన తేళ్లు ఇళ్లలోకి చేరుకున్నాయి.
ఈ తేళ్లు కుట్టడంతో ముగ్గురు చనిపోయారని, 450 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు.
ముఖ్యంగా నైలు నదికి సమీపంలో శుక్రవారం వడగళ్లు, ఉరుములతో వచ్చిన తుఫాను హింసాత్మకంగా మారింది.
భారీ వర్షాలు వచ్చినపుడు తేళ్లు తరచూ వీధుల్లోకి కొట్టుకొస్తుంటాయి. పాములు కూడా కనిపిస్తుంటాయి.
పర్వతాలు, ఎడారులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోని వైద్య కేంద్రాలకు యాంటీ వీనమ్ అదనపు డోసులను అందించామని ఒక అధికారి అల్-అహ్రమ్ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.
తేళ్లు కుట్టడంతో ఆస్పత్రులకు వస్తున్న వారికి వైద్య చికిత్స అందిస్తున్న డాక్టర్లు ప్రస్తుతం కరోనా టీకాలు ఇవ్వడం నిలిపివేశారు.
జనం ఇళ్లలోనే ఉండాలని చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఫాట్ టెయిల్డ్ స్కార్పియన్లకు ఈజిఫ్టు ఆవాసం. నల్ల ఫాట్ టెయిల్ తేలు మనిషిని కుడితే ఆ విషం గంటలోపే వారి ప్రాణం తీయగలదు.
విస్తృతమైన విష ప్రభావాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు నలిపేసినట్లు ఉండడం, తలలో ఇబ్బందిగా ఉండడం లాంటివి ఉంటాయి.
లక్షణాలు పెరగక ముందే నివారణ కోసం యాంటీ వీనమ్ ఇవ్వవచ్చు. కానీ, లక్షణాలు తీవ్రంగా ఉన్నా అది పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- న్యూజీలాండ్: ఈ అరుదైన అంటార్కిటికా పెంగ్విన్ 3 వేల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణించింది?
- జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?
- ‘మా పిల్లల్ని అమ్మేస్తాం, కొంటారా?’
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
- ‘మాకు తెలియని మా దేశాన్ని చూస్తున్నాం’
- ‘టీ20 కెప్టెన్సీ రోహిత్‌కు అప్పగించడానికి ఇదే సరైన సమయం’ - విరాట్ కోహ్లీ
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
- నేను పదేళ్ల నుంచి ఒరిజినల్ మెటావర్స్ సెకండ్ లైఫ్‌లో జీవిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతోందంటే..
- విశాఖపట్నం లైన్‌మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
- ప్రశాంత్ పంచాడ ఎవరు? అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడు
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)