కరోనాతో దెబ్బతిన్న అమెరికా టూరిజం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోగలదా?
కరోనా ఆంక్షలతో బాగా దెబ్బతిన్న రంగాల్లో అమెరికా టూరిజం ఒకటి.
న్యూయార్క్ వంటి నగరాలు సుమారు 20 నెలలుగా విదేశీ పర్యాటకుల కోసం ఎదురు చూస్తున్నాయి.
దేశీయ టూరిస్టులతో పోలిస్తే విదేశీయులు ఎక్కువ ఖర్చు చేయడం ఈ నగరాలకు కలిసొచ్చే అంశం.
బాగా పేరుగాంచిన ప్రదేశాలు కరోనా సంక్షోభాన్ని తట్టుకొని నిలబడినా ఇతర పర్యాటక ప్రాంతాల్లో వ్యాపారం బాగా దెబ్బతింది.
చాలా వరకు రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడటంతో ఆతిథ్య రంగం కూడా కుదేలైంది.
నాటకాలకు, షోలకు పేరుగాంచిన బ్రాడ్‌వే థియేటర్లు మళ్లీ తెరచుకుంటున్నాయి. విదేశీ పర్యాటకులే లక్ష్యంగా టూరిస్ట్ కంపెనీలు న్యూయార్క్‌లో భారీగా ప్రకటనలు ఇస్తున్నాయి.
పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు అమెరికా ఇప్పుడు తలుపులు తెరుస్తోంది. కానీ కేవలం మార్కెటింగ్ లేదా పబ్లిషిటీ వల్ల న్యూయార్క్ టూరిజం వెంటనే మెరుగుపడుతుందనే హామీ లేదు.
మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే చాలా ఏళ్లు పడుతుందన్నది అధికారిక అంచనా.
గత ఏడేళ్లుగా ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న ఫిల్ డిజియర్ వంటి వారు, విదేశీ పర్యాటకులను అనుమతించడంపై చాలా ఆశావాహంగా ఉన్నారు. తిరిగా తమ వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.
న్యూయార్క్‌లో జరిగే హింస కూడా పర్యాటకంపై ప్రభావం చూపుతోంది. హత్యలు, కాల్పులు తగ్గినా ఇతర రకాల నేరాలు పెరిగాయి.
సిబ్బంది కొరత, పెరుగుతున్న ధరలతో హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనే వార్తలు వస్తున్నాయి.
మొత్తానికైతే టూరిస్టులు తిరిగి వస్తున్నందుకు న్యూయార్క్ వాసులు సంతోషంగానే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కాలుష్యం, పెట్రోల్ ధరల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయా?
- ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్, నవీన్ పట్నాయక్ ఏం చర్చించారంటే..
- వారణాసి: మోక్షానికే కాదు, శాకాహార భోజన ప్రియులకు కూడా స్వర్గధామంగా మారిన ప్రాచీన నగరం
- స్వస్తిక: హిట్లర్ హిందూ మత చిహ్నాన్ని తన పార్టీ గుర్తుగా ఎందుకు ఎంచుకున్నారు?
- పద్మశ్రీ హరెకల హజబ్బ: పండ్లు అమ్ముకునే నిరక్షరాస్యుడు.. స్కూలు నిర్మించి, విద్యను అందిస్తున్నాడు
- వరి పండించడం వల్ల పర్యావరణానికి ప్రమాదమా
- చైనా ఎడారిలో అమెరికా యుద్ధనౌకలను పోలిన నిర్మాణాలు, ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
- పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు స్డేడియానికి వెళ్లనున్న ఇండియన్ సానియా మీర్జా ఒక్కరేనా? ట్విటర్‌లో ఏమిటీ చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)