అంతరిక్షాన్ని శోధించే టెలిస్కోప్‌లకు సముద్రంలోని ఎండ్రకాయలకూ ఏంటి సంబంధం?
అంతరిక్షంలో జరిగే అరుదైన సంఘటనలను స్పేస్ టెలిస్కోప్‌లు అన్వేషిస్తుంటాయి. అయితే, సంప్రదాయ టెలిస్కోప్‌లు కొన్ని ప్రాంతాలపై మాత్రమే దృష్టిపెడతాయి.
అసాధారణ పరిణామాలను గుర్తించడానికి ఇవి అంతగా ఉపయోగపడవు.
దీంతో అంతరిక్షం మొత్తాన్నీ గమనించేలా టెలిస్కోప్‌లను తయారు చేయాలనుకున్న శాస్త్రవేత్తలకు.. ఆ పరిజ్ఞానం సముద్రం లోతుల్లో తారసపడింది.
సముద్రం అడుగున బురద నీటిలో జీవించే లోబ్‌స్టర్లు.. అదేనండీ ఎండ్రకాయలు, తమ చుట్టుపక్కల పరిసరాలను గమనించేందుకు భిన్నమైన పద్ధతిని అనుసరిస్తుంటాయి.
వాసన, రుచి చూసేందుకు అవి యాంటెన్నా వంటి భాగాలను ఉపయోగిస్తాయి.
అలాగే, వాటి కళ్లలో ఉండే చిన్నచిన్న చతురస్రాల్లాంటి వేలాది నిర్మాణాలు కూడా ఏ దిశలో వచ్చే కాంతినైనా కంటిపై ప్రతిబింబించేలా చేస్తాయి.
దీంతో ఈ ఎండ్రకాయలు తమ ముందున్న వాటినే కాకుండా పక్కన, వెనుక భాగాల్లో జరిగే పరిణామాలను కూడా పసిగడతాయి.
ఇదే పరిజ్ఞానం ఆధారంగా శాస్త్రవేత్తలు అన్ని కోణాల్లో ఎక్స్‌రేలను గుర్తించేలా సరికొత్త అంతరిక్ష టెలిస్కోప్‌లను రూపొందించారు.
ఇవి కూడా చదవండి:
- భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- ‘డుగ్ డుగ్' బుల్లెట్ బండిపై సినిమా, ఇంతకూ రాయల్ ఎన్ఫీల్డ్కు గుడి ఎందుకు కట్టారు
- నేను పదేళ్ల నుంచి ఒరిజినల్ మెటావర్స్ సెకండ్ లైఫ్‌లో జీవిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతోందంటే..
- ప్రజలంతా ఆయుధాలు పట్టాలని కోరుతున్న దేశం, కారణమేంటి
- టీ20 వరల్డ్ కప్: 2007లోనే చాంపియన్‌గా నిలిచిన భారత్ 2021లో ఎందుకు చతికిలపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


