సూర్యుడిని ఎన్నడూ చూడనంత స్పష్టంగా చూపించిన అమెరికాలోని టెలిస్కోప్

వీడియో క్యాప్షన్, ఎన్నడూ చూడనంత స్పష్టంగా సూర్యుడు

సూర్యుడి ఉపరితలాన్ని ఇప్పటివరకు ఎన్నడూ చూడనంత స్పష్టంగా చూపించే చిత్రాలను అమెరికాలోని ఒక భారీ టెలిస్కోప్ అందించింది.

సూర్యుడి ఉపరితలంపై కేవలం 30 కి.మీ. పరిధిలో ఉన్న అంశాలను కూడా ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

హవాయి రాష్ట్రంలోని ప్రసిద్ధ డేనియర్ కె.ఇనోయి సోలార్ టెలిస్కోప్ ఈ చిత్రాలను అందించింది. ఈ టెలిస్కోప్‌నే 'డీకేఐఎస్‌టీ' అని వ్యవహరిస్తారు.

సూర్యుడు భూమికి 14.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. సూర్యుడి వ్యాసం సుమారు 14 లక్షల కిలోమీటర్లు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, '30 కిలోమీటర్ల' పరిధిలోని ఉపరితల దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించగలగడం పెద్ద విశేషమే.

సూర్యుడిలో జరిగే వివిధ ప్రక్రియలు, మార్పులను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్ వాడతారు. అంతరిక్ష వాతావరణాన్ని మెరుగ్గా అంచనా వేయడానికి ఈ పరిజ్ఞానం దోహదం చేస్తుందని వారు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)