వరదలు, కరవును తట్టుకునే వ్యవసాయం ఇదీ..

వీడియో క్యాప్షన్, వరదలు, కరవును తట్టుకునే వ్యవసాయం ఇదీ..

సుదీర్ఘ కాలం కొనసాగే కరవు కాలం, భారీ వర్షాలు, పెను తుఫాన్లు - ఆఫ్రికాలో వ్యవసాయ ఆధారిత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన పర్యావరణ మార్పుల సవాళ్లు ఇవి.

రానున్న రోజుల్లో ఇవి మరింత తీవ్రమవుతాయని భావిస్తున్నారు.

ఈ సమస్యల కారణంగా రైతులు అనుసరిస్తున్న మార్గమేంటి?

పదేళ్ల క్రితం క్లైమేట్ స్మార్ట్ విలేజ్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. సరికొత్త పద్దతుల్లో ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రారంభించిన అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఇది.

ఈ ప్రాజెక్ట్‌లోని 11 గ్రామాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఈ గ్రామాలను పరిశీలించడానికి ఉత్తర టాంజానియా వెళ్లింది బీబీసీ బృందం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)