‘మాతో పెట్టుకుంటే ఉక్కు గోడకు తల బాదుకున్నట్లే’- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరిక

వీడియో క్యాప్షన్, ‘మాతో పెట్టుకుంటే ఉక్కు గోడకు తల బాదుకున్నట్లే’- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరిక

తమను బెదిరించాలని, ప్రభావితం చేయాలని చూసే విదేశీ శక్తుల తల పగలడం ఖాయమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్రంగా హెచ్చరించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం తన ప్రసంగంలో ఆయన.. 'బీజింగ్‌కు హితబోధలు చేయొద్దు' అంటూ అమెరికాను ఉద్దేశించి అన్నారు.

హాంకాంగ్‌లో చైనా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కోవిడ్, గూఢచర్యం, వాణిజ్యం తదితర అంశాల నేపథ్యంలో ఇటీవల కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

తైవాన్ అంశం కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణమే. ప్రజాస్వామ్య తైవాన్ దేశం తనను సార్వభౌమ దేశంగా చెబుతుండగా చైనా మాత్రం ఆ ద్వీపాన్ని తమతో విడిపోయిన రాష్ట్రంగా చూస్తోంది.

జిన్‌పియాంగ్ తన తాజా ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావిస్తూ తైవాన్ ఏకీకరణకు చైనా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

''దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను కాపాడుకోవడంలో చైనా ప్రజల సంకల్ప శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయరాద''ని జిన్ పింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)