సూపర్ సోనిక్ ప్యాసెంజర్ విమానాలు, గంటకు 2,000 కి.మీ వేగం

వీడియో క్యాప్షన్, సూపర్ సోనిక్ ప్యాసెంజర్ విమానాలు, గంటకు 2,000 కి.మీ వేగం

సూపర్‌సోనిక్ వేగంతో దూసుకెళ్లే 15 కొత్త విమానాలను కొనుగోలు చేయబోతున్నట్లు అమెరికా విమానయాన సంస్థ ‘‘యునైటెడ్’’ తెలిపింది. 2029లో మళ్లీ సూపర్‌సోనిక్ వేగాన్ని ప్రజలకు పరిచయం చేస్తామని వెల్లడించింది.

చివరిసారిగా 2003లో సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 1970ల నుంచి 2003 వరకు ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లకు చెందిన కాంకార్డ్ విమానాలు సేవలు అందించాయి.

ప్రస్తుతం డెన్వర్‌కు చెందిన ‘‘బూమ్’’ సంస్థ ‘‘ఓవర్‌ట్యూర్’’ పేరుతో కొత్త విమానాలను అభివృద్ధి చేస్తోంది. సూపర్‌సోనిక్ విమానాలను సంస్థ తయారుచేయడం ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)