ప్రిన్స్ ఫిలిప్ 99 ఏళ్ల జీవనయానం ఛాయాచిత్రాల్లో...

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ 1921 జూన్ 10న గ్రీక్ ఐలాండ్ కొర్ఫూలో జన్మించారు. ఆయన వంశవృక్షంలో డెన్‌మార్క్, జర్మనీ, రష్యా, బ్రిటన్‌కు చెందిన రాయల్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఫొటో క్యాప్షన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా 1921 జూన్ 10న గ్రీక్ ఐలాండ్ కొర్ఫూలో జన్మించారు. ఆయన వంశవృక్షంలో డెన్‌మార్క్, జర్మనీ, రష్యా, బ్రిటన్‌కు చెందిన రాయల్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
ప్రిన్స్ ఫిలిప్.. ప్రిన్స్‌ ఆండ్రూ ఆఫ్‌ గ్రీస్‌, ప్రిన్సెస్‌ ఆలిస్‌ ఆఫ్ బాటెన్‌బర్గ్‌ల ఏకైక కుమారుడు

ఫొటో సోర్స్, GETTY IMAGES / ALAMY

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ ఫిలిప్.. ప్రిన్స్‌ ఆండ్రూ ఆఫ్‌ గ్రీస్‌, ప్రిన్సెస్‌ ఆలిస్‌ ఆఫ్ బాటెన్‌బర్గ్‌ల ఏకైక కుమారుడు
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో సెయింట్-క్లౌడ్‌లోని మాక్‌జానెట్ అమెరికన్ స్కూల్లో ప్రిన్స్ ఫిలిప్ తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంలో తన తోటి విద్యార్థులతో (ఎడమ నుంచి రెండవ వ్యక్తి) కలిసి ఉన్న ప్రిన్స్ ఫిలిప్‌ను చూడవచ్చు. ఏడేళ్ల వయసులో ఆయన మౌంట్‌బాటెన్ బంధువులతో కలిసి ఉండేందుకు ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడే సర్రేలో ఆయన ప్రీ స్కూలుకు హాజరయ్యారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, అనంతరం, ఆయన ఉత్తర స్కాట్లాండ్‌లో విద్యావేత్త కర్ట్ హాన్ స్థాపించిన గోర్డన్‌స్టన్ బోర్డింగ్ స్కూల్లో చేరారు. అక్కడ ఆయన క్రీడల్లో రాణించారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ ఎలిజబెత్ (ఎడమ నుంచి మూడవ వ్యక్తి), నావల్ కేడెట్ ప్రిన్స్ ఫిలిప్ ఆఫ్ గ్రీస్ అండ్ డెన్మార్క్ (కుడివైపున చివర్లో తెల్లని క్యాప్ పెట్టుకున్న వ్యక్తి) కలిసి ఉన్న తొలి ఫొటో ఇదేనని భావిస్తారు. ఇది, 1939 జూలై 23న డార్ట్‌మౌత్‌లోని రాయల్ నావల్ కాలేజీ సందర్శించిన సందర్భంలో తీసిన ఫొటో.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రిన్స్ ఫిలిప్ యుద్ధనౌక హెచ్ఎంఎస్ వాలియంట్‌లో మిడ్‌షిప్‌మన్‌గా ఉంటూ యుద్ధంలో పాలుపంచుకున్నారు. 1941లో ఇటాలియన్ యుద్ధనౌకలు గ్రీస్ తీరం‌లో చిక్కుకున్నప్పుడు, శత్రువులను కనుగొనేందుకు సెర్చ్‌లైట్ల ఆపరేషన్‌ కమాండర్‌గా ఫిలిప్ వ్యవహరించారు. అనంతరం ఆయన సేవలను ప్రస్తావిస్తూ ఉన్నతాధికారులు హై కమాండ్‌కు పంపిన నివేదికలో ప్రశంసించారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ ఎలిజెబెత్‌తో ఆయన వివాహ నిశ్చితార్థం వార్తను 1947 జూలైలో అధికారికంగా ప్రకటించారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ఆ ఏడాది నవంబర్ 20న వారి వివాహం జరిగింది.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1951లో టర్కీలోని మామరిస్‌లో బీచ్ ఒడ్డుకు చేరగానే డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా తన వాటర్ స్కీస్ కిందకు దూకిన క్షణాన్ని ఒక ఫొటోగ్రాఫర్ తన కెమేరాలో బంధించారు. హెచ్ఎంఎస్ మ్యాగ్‌పై కమాండర్‌గా ఆయన చివరి పోస్టింగ్ సమయంలో ఈ ఫొటో తీశారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, రోహాంప్టన్ కప్ సెమీ ఫైనల్స్‌లో కౌడ్రే పార్క్ తరుపున పోలో ఆడుతున్న ప్రిన్స్‌ను ఈ చిత్రంలో చూడవచ్చు. బ్రిటన్‌లోని ప్రముఖ పోలో ఆటగాళ్లల్లో ప్రిన్స్ ఫిలిప్ ఒకరు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, డ్యూక్ మంచి క్రికెట్ ప్లేయర్ కూడా. ఇక్కడ, మాజీ ఇంగ్లండ్ స్టార్‌లతో కూడిన ఆయన టీం, డ్యూక్ ఆఫ్ నార్ఫోక్ కెప్టెన్సీలో సస్సెక్స్ ప్లేయర్ల టీంతో ఆడుతున్న చిత్రాన్ని చూడవచ్చు.
ప్రిన్స్ ఫిలిప్
ఫొటో క్యాప్షన్, ది డ్యూక్‌, క్వీన్‌లకు నలుగురు పిల్లలు, (ఎడమ నుంచి) ఎడ్వర్డ్, ఆండ్రూ, అన్నే, ఛార్లెస్‌లను 1960లో తీసిన ఈ చిత్రంలో చూడవచ్చు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారు తమ బాల్మోరల్ ఎస్టేట్‌లోని ఒక ఫామ్‌ను సందర్శించినప్పుడు తీసిన ఫొటో.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1977లో క్వీన్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ప్రిన్స్ తోడుగా హాజరయ్యారు. ఫిబ్రవరిలో న్యూజీలాండ్‌లోని గిస్‌బోర్న్ రగ్బీ పార్క్‌లో రాయల్ న్యూజీలాండ్ పాలినేషియన్ పండుగ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంలో వారిద్దరూ మావొరీ కహు-కివి (కివి ఈకలతో చేసిన వస్త్రాలు) ధరించి ఉండడం ఈ చిత్రంలో చూడవచ్చు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, అదే ఏడాది, బార్బడోస్ దగ్గర్లో తమ రాయల్ విహారనౌక బ్రిటానియాను దాటుకుంటూ వెళుతున్న కాన్‌కోర్డ్‌కు రాయల్ దంపతులు చేయి ఊపుతున్న దృశ్యాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1979 ఆగస్ట్‌లో క్వీన్ కజిన్ లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ ఐర్లండ్‌లో తన బోటు మీద జరిగిన ఐఆర్ఏ బాంబు దాడిలో మరణించారు. ఈ వార్త విన్న వెంటనే ఉత్తర ఫ్రాన్స్‌లోని నార్మాండీలో కోచ్-డ్రైవింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగం పంచుకుంటున్న డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా బ్రిటన్‌కు తిరిగి వచ్చారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అంటే డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ఎంతో మక్కువ. ఈ కారణాల వలన ఆయన అప్పట్లో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్‌కు అంతర్జాతీయ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడం సహజ పరిణామంగా తోచింది.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1985లో చిన్నపిల్లలుగా ఉన్న ప్రిన్స్ విలియం, హ్యారీలతో సహా తన కుటుంబ సభ్యులందరితో ఉన్న డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాను ఈ చిత్రంలో చూడవచ్చు. బకింగ్‌హం ప్యాలస్ వద్ద జరుగుతున్న విమాన విన్యాసాలను చూడడానికి వారంతా అక్కడ సమావేశమయ్యారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1996లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా బ్రిటన్ పర్యటనకు వచ్చిన తొలి రోజు జరిగిన హార్స్ గార్డ్స్ పరేడ్‌లో హానర్ గార్డ్‌ను పర్యవేక్షించేదుకు ది డ్యూక్ వెంట నడిచారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 2002లో గోల్డెన్ జూబ్లీ వేడుకలతో సహా 60 ఏళ్లకు పైగా సాగిన క్వీన్ పరిపాలనలో ప్రిన్స్ ఫిలిప్ ఆమెకు మద్దతుగా నిలిచారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1956లో యువత సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ది డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా అవార్డ్ స్కీంను ప్రిన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో 2010లో హోలీరూడ్‌హౌస్‌లో డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా గోల్డ్ అవార్డ్ విజేతలతో ఆయన సరదాగా మాట్లాడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, పెద్ద వయసులో కూడా ప్రిన్స్ క్రీడల్లో పాల్గొనేవారు. 2005లో సాండ్రింగంలో జరిగిన క్యారేజ్-డ్రైవింగ్‌లో పాల్గొన్నారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2011లో ప్రిన్స్ ఫిలిప్ మనుమడు ప్రిన్స్ విలియం, క్యాథరీన్ మిడిల్‌టన్‌ను వివాహం చేసుకున్న సందర్భంలో రాయల్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపేందుకు బకింగ్‌హం ప్యాలస్ ఎదుట వేల సంఖ్యలో జనం గుమికూడారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఏడాది తర్వాత ప్రిన్స్‌ మంచి ఆరోగ్యంతో కనిపించారు. 2012 జూన్‌ 3న రాణితో కలిసి డైమండ్‌ జూబ్లీ రివర్‌ పాజెంట్‌ కార్యక్రమంలో ప్రిన్స్‌ పాల్గొన్నారు. 80 నిమిషాలు సాగిన ప్రయాణంలో 1000 బోట్లు వారి వెంటరాగా, థేమ్స్‌ నదిలో టవర్‌ బ్రిడ్జి వరకు ఏడు మైళ్ల దూరం ప్రయాణించారు. జూన్‌ 4న డైమండ్‌ జూబ్లీ వేడుకలో పాల్గొనాల్సి ఉండగా, మూత్రాశయంలో సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోలుకున్న తర్వాత ఆయన ప్రిన్సెస్‌ అన్నేతో కలిసి గ్రేట్‌ బ్రిటన్‌ ఈక్వెస్ట్రియన్‌ జట్టు ఆటను చూడటానికి వెళ్లారు. అక్కడ తన మనుమరాలు జారా ఫిలిప్స్‌ ఆ జట్టులో ఆడుతున్నారు. ఆ జట్టే 2012 లండన్‌ ఒలింపిక్స్‌కు ఎన్నికైంది.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, 2013లో రాణి పట్టాభిషేకం జరిగి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బేలో చర్చ్‌ సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, 2014లో ఆయన రాణితో కలిసి నార్తర్న్‌ ఐర్లాంట్‌ యాత్రలో పాల్గొన్నారు. బెల్‌ఫాస్ట్‌లోని హిల్స్‌బర్గ్‌ క్యాజిల్‌లో విజిటర్‌ బుక్‌లో సంతకం చేస్తూ కనిపించారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, విండ్సర్‌ ప్యాలెస్‌లో వీఈ డే 70వ వార్షికోత్సవంలో రాణితో కలిసి ప్రిన్స్‌ ఫిలిప్‌ పాల్గొన్నారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, డోర్చెస్టెర్ అంచున ఉన్న ఒక అర్బన్ డెవలప్‌మెంట్, పౌండ్‌బరీకి వెళ్లినపుడు డ్యూక్ ఆయన కుమారుడు ఛార్లెస్ మధ్య సరదా సంభాషణ సాగిన క్షణం. అక్కడ క్వీన్ తన తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, 2017 ఏప్రిల్లో బెడ్‌పోర్డ్‌షైర్‌లోని జడ్ఎస్ఎల్ విప్‌స్నేడ్ జూలో ఉన్న ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి రాణికి తోడుగా వచ్చిన డ్యూక్. అయితే 95 ఏళ్ల వయసులో బహిరంగ కార్యక్రమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు, దానికి రాణి పూర్తి మద్దతు ఇచ్చినట్లు ప్రకటించారు.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, మాంచెస్టర్‌లోని అరియానా గ్రాండే కాన్సెర్ట్‌ దగ్గర చనిపోయిన వారికి నివాళిగా 2017 మే 23న బకింగ్‌హం పాలెస్‌లో జరిగిన గార్డెన్ పార్టీ ప్రారంభంలో క్వీన్ పక్కనే నిలుచుని నిమిషం పాటు మౌనం పాటించిన డ్యూక్.
ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ చరిత్రలో ఎక్కువ కాలం సేవలు అందించిన రాయల్ సహచరుడు ది డ్యూక్.

(All photographs subject to copyright)